రుతు పరిశుభ్రత సామాజిక బాధ్యత…

  రుతుస్రావం ఈ మాట వినగానే ఏదో చెప్పకూడని, అనకూడని విషయంగా చాలా మంది అనుకుంటా రు. కానీ, ఒక అమ్మాయి పూర్తి మహిళగా రూపాంతరం చెందిందనే బలమైన సూచననిచ్చే రుతస్రావం గురించి రహస్యంగా ఉంచాల్సిన అవసరంలేదంటారు నిపుణులు. రుతుస్రావం అనేది మహిళ శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అసలు పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ ఎలా వాడాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ అంటే […] The post రుతు పరిశుభ్రత సామాజిక బాధ్యత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రుతుస్రావం ఈ మాట వినగానే ఏదో చెప్పకూడని, అనకూడని విషయంగా చాలా మంది అనుకుంటా రు. కానీ, ఒక అమ్మాయి పూర్తి మహిళగా రూపాంతరం చెందిందనే బలమైన సూచననిచ్చే రుతస్రావం గురించి రహస్యంగా ఉంచాల్సిన అవసరంలేదంటారు నిపుణులు. రుతుస్రావం అనేది మహిళ శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అసలు పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ ఎలా వాడాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ అంటే ఏంటి…ఇలాంటి విషయాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. రుతుస్రావం సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, వీటి గురించి అవగాహన లేక చాలామంది సమస్యలను తెచ్చుకుంటున్నారు. ఆ సమస్యలను బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడి మరింత అనారోగ్యానికి గురౌతున్నారు. కానీ, పీరియడ్స్ విషయంలో ఎప్పుడు కూడా అలాంటి తప్పులు చేయొద్దని చెబుతున్నారు నిపుణులు.

రుతుస్రావం సమయంలో వచ్చే శారీరక, మానసిక సమస్యల కంటే పీరియడ్స్ వల్ల వచ్చే సమస్యలు అధికం. మరకలు పడ్డాయా? ఎవరైనా చూశారా? వారు నా గురించే మాట్లాడుకుంటున్నారా? అని చాలామంది అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. చాలావరకూ ఈ సమయంలో న్యాప్‌కిన్స్ వాడుతుంటారు. ఆ న్యాప్‌కిన్స్ బ్రాండ్ నేమ్ కూడా ఏవో సీక్రెట్ అన్నట్లుగా ఉంటాయి. అవేవో బయటికి మాట్లాడకూడదన్నట్లు పెడతారు.

ఇక మన సమాజంలో కొన్ని పద్ధతులు కూడా అలానే ఉంటాయి. గుళ్లోకి వెళ్లకూడదు, వంటింట్లో పనిచేయకూడదు. పచ్చళ్లను ముట్టకోకూడదనే పద్ధతులు పాతకాలం నుంచి వున్నాయి. వీటన్నింటిని చూస్తుంటే ఆ ఐదురోజులు స్త్రీలను బహిష్కరించినవారిగా చూస్తుంటారు. ఎప్పుడో మొదలైన ఈ తంతు ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. పద్ధతుల గురించి చెబుతున్నవారంతా పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పకపోవడం విచారకరం.

రుతుస్రావం గురించి కేవలం అమ్మలు, అమ్మమ్మలే చెప్పడమే కాకుండా పాఠశాలల్లోనూ ఈ విషయం గురించి క్లాసులుండాలి. మొదటిసారి రుతుస్రావం అయిన అమ్మాయిలు భయపడకుండా.. వారి కి ముందునుంచే జాగ్రత్తలు చెప్పాలి. రుతుస్రావం విషయంలో కనీస అవగాహన ముఖ్యం. ఇలాంటివి తెలిసినప్పుడే బాలికలు ఏ భయం లేకుండా స్కూల్ జీవితాన్ని గడపగలరు. కేవలం ఇది బాలికలకు సంబంధించిన అంశమనుకుంటే పొరబాటే.. అబ్బాయిలకు కూడా ఈ విషయం గురించి తెలియజేయాలి. టీనేజ్‌లో బట్టలపై పడ్డ మరకల గురించి భయమెందు కు? ఇది అందరం తెలుసుకోవాలి, అది బ్లీడింగ్ అ ని… అమ్మాయిల్లో అది సర్వసాధారణమని! పీరియడ్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి. అందరికీ తెలియజేయాలి. ముఖ్యం గా పీరియడ్స్ టైమ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. జననాంగాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలి. ప్యా డ్స్ మారుస్తూ ఉండాలి. లేకపోతే బ్యాక్టీరియా చేరి సమస్యలు మొదలవుతాయి. ప్రతీ మహిళ ఈ విషయాన్ని కచ్చితంగా పాటించాలి.

పరిశుభ్రత తప్పనిసరి: రుతు పరిశుభ్రత ప్రతి ఒక్కరికీ అవసరం. పరిశుభ్రత పాటించకపోతే మ హిళలు, యుక్తవయసు బాలికలతోపాటు పర్యావరణంపై కూడా ప్రభావం పడుతుంది. మహిళలకు మూత్రాశయ నాళాలకు సంబంధించిన వ్యాధులొస్తాయి. దీంతో జననాంగాలు, పునరుత్పత్తి అ వయవాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
యునిసెఫ్ వారి లెక్కల ప్రకారం ఇండియాలో బాలికలు సాధారణంగా నెలకు ఒకట్రెండు రోజులు స్కూలుకు వెళ్లడం లేదు. ఎందుకంటే బాలికలకు పాఠశాలలో ప్యాడ్స్ మార్చుకోవడానికి సరైన వసతుల్లేవు. 2015=16 లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వారు కేవలం 58 శాతం మంది మాత్రమే రుతు సమయంలో పరిశుభ్రత పాటిస్తున్నారు.

అస్కి సాయంతో మరింత అవగాహన: యునిసె ఫ్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) సా యంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్వచ్ఛభారత్, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాలు కూడా బాలికలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నాయి. జాతీయ గ్రామీణ జీవనోపాదుల సంస్థ ద్వారా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ చిన్న ఉత్పత్తిదారులకు, స్వయం సేవక సంఘాలకు సానిటరీ ప్యాడ్‌లు తయారుచేయడానికి కావల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నాయి.

రుతు పరిశుభ్రతా నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం ASCI ఒక సంపుటి( బుల్లెట్) ని తయారుచేసింది. దీంట్లో దాదాపు 200 మంది రిసోస్ పర్సన్స్‌కు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలలు, క ళాశాలలు, హాస్టల్స్‌లో ఉంటున్న అమ్మాయిలు దాదాపు 20 లక్షల మంది విద్యార్థినులకు అందించింది. మెప్మాకు చెందిన దాదాపు 350 మంది రిసోర్స్ పర్సన్స్‌కు కూడా ఈ బుల్లెట్ ద్వారా శిక్షణ ఇచ్చింది. వీరి సాయంతో దాదాపు 20 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఇది చేరుతుంది.

అస్కి, ఒక కార్పొరేట్ సెక్టర్‌తో కలిసి ప్రతి సంవత్సరం రుతు పరిశుభ్రత, నిర్వహణ అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో రుతుస్రావం, పరిశుభ్రతకు సంబంధించి సంఘంలో ఉన్న మూఢ నమ్మకాలపై దృష్టి సారించి కృషి చేస్తోంది. పౌష్టికాహారం, పరిశుభ్రతా పద్ధతులు, మార్కెట్‌లో ఉన్న వివిధ ఉత్పత్తులు, వాటిని వినియోగించే విధానాలు, సరైన పద్ధతిలో పారేయడం గురించి అవగాహన కల్పిస్తోంది.

రుతు పరిశుభ్రత అనేది కేవలం మహిళల సమస్య మాత్రమే కాదు. ఇదొక సామాజిక సమస్య. ఇంటి దగ్గర, పాఠశాలలో పరిశుభ్రతా పరమైన సదుపాయాలు అందుబాటులో లేకపోతే ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, పంచాయితీ పెద్దలను ఈ కార్యక్రమంలోకి తీసుకురావాలని ఎఎస్‌సిఐ భావిస్తోంది.

Menstruation is a Natural Process of the Woman’s Body

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రుతు పరిశుభ్రత సామాజిక బాధ్యత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.