48 మెగాపిక్స‌ల్ కెమెరాతో నయా స్మార్ట్ ఫోన్…

ముంబయి: మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు కు చెందిన నూత‌న స్మార్ట్ ఫోన్ మెయ్‌జు నోట్ 9 ను మార్చి 6వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న భారీ రిజ‌ల్యూష‌న్‌ కెమెరాను అమర్చారు. ముందు భాగంలోనూ 20 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండగా… ఈ ఫోన్‌లో 4000 ఎంఎహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. కాగా ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను సంస్థ ఇంకా వెల్ల‌డించ‌లేదు. మెయ్‌జు నోట్ 9 […]

ముంబయి: మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు కు చెందిన నూత‌న స్మార్ట్ ఫోన్ మెయ్‌జు నోట్ 9 ను మార్చి 6వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న భారీ రిజ‌ల్యూష‌న్‌ కెమెరాను అమర్చారు. ముందు భాగంలోనూ 20 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండగా… ఈ ఫోన్‌లో 4000 ఎంఎహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. కాగా ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను సంస్థ ఇంకా వెల్ల‌డించ‌లేదు.

మెయ్‌జు నోట్ 9 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు…

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,

2244×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌,

6 జిబి ర్యామ్‌, 64/128 జిబి స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0

డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,

20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,

డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఇ, యుఎస్‌బి టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

 

Meizu Note 9 with 48 MP primary camera

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: