నందమూరి హీరోకు జోడీగా

  ‘ఎఫ్ 2’ చిత్రంతో ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అనిపించుకున్న యంగ్ బ్యూటీ మెహరీన్ చాలా జాగ్రత సినిమాలను ఓకె చేస్తోంది. పంజాబీ సినిమాలు చేస్తూనే తెలుగులో రెండు సినిమాలు ఓకె చేసింది. అందులో ఒకటి నందమూరి హీరో పక్కన కావడం విశేషం. ‘118’ సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాకు మెహరీన్‌ను నాయికగా తీసుకున్నారు. ఈ సినిమాను శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సతీష్ […] The post నందమూరి హీరోకు జోడీగా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఎఫ్ 2’ చిత్రంతో ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అనిపించుకున్న యంగ్ బ్యూటీ మెహరీన్ చాలా జాగ్రత సినిమాలను ఓకె చేస్తోంది. పంజాబీ సినిమాలు చేస్తూనే తెలుగులో రెండు సినిమాలు ఓకె చేసింది. అందులో ఒకటి నందమూరి హీరో పక్కన కావడం విశేషం. ‘118’ సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాకు మెహరీన్‌ను నాయికగా తీసుకున్నారు. ఈ సినిమాను శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సతీష్ వేగెశ్న చేయబోతున్నారు. సతీష్ బలం ఫ్యామిలీ సినిమాలే. అయితే కళ్యాణ్‌రామ్ కోసం ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్‌లోనే కొద్దిగా యాక్షన్ టచ్‌తో స్క్రిప్ట్ తయారుచేసినట్లు తెలిసింది. సతీష్ సినిమాల్లో హీరోయిన్లకు కూడా కాస్త మంచి పాత్రలే వుంటాయి. ఈ సినిమాలో కూడా ప్రాధాన్యత వున్న హీరోయిన్ పాత్రను తయారు చేశారని… దానికి మెహరీన్‌ను ఎంపిక చేశారని తెలిసింది.

Mehreen to romance with Kalyan ram!

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నందమూరి హీరోకు జోడీగా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: