మీ సేవ ‘2.0’

కొత్త వెర్షన్ ద్వారా పౌర సేవలు మరింత విస్తృతం,  ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన మీ సేవ 2.0 వెర్షన్ ద్వారా పౌర సేవలు మరింత విస్తృతం కానున్నాయి. మీ సేవ కేంద్రానికి వెళ్లి గంటల తరబడిసర్వీసుల కోసం వేచి చూసే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మీ సేవలు కావాలనుకునే వారు తమ సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్ల ద్వారా సిటిజన్ పేరుతో లాగిన్ అయి […] The post మీ సేవ ‘2.0’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కొత్త వెర్షన్ ద్వారా పౌర సేవలు మరింత విస్తృతం,  ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన మీ సేవ 2.0 వెర్షన్ ద్వారా పౌర సేవలు మరింత విస్తృతం కానున్నాయి. మీ సేవ కేంద్రానికి వెళ్లి గంటల తరబడిసర్వీసుల కోసం వేచి చూసే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మీ సేవలు కావాలనుకునే వారు తమ సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్ల ద్వారా సిటిజన్ పేరుతో లాగిన్ అయి మీ సేవకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే 600 రకాల సేవలను అందిస్తున్న మీసేవల్లో, కొత్త టెక్నాలజీను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్ధేశ్యంతో తెలంగాణ ఐటీ శాఖ 2.0 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఏదైనా ధ్రువీకరణ పత్రం అవసరమైతే మీ సేవ కేంద్రాలకు వెళ్లేవారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కొత్తగా 2.0 వెర్షన్ ద్వారా సామాన్యులకు మీ సేవ దరఖాస్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్మార్ట్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా మీ సేవ 2.0 వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో కేఐఓఎస్‌కేలోకి వెళ్లాలి. ఇందులో మూడు రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మొదటగా సిటిజన్ సర్వీస్‌లోకి వెళ్లి అనంతరం యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పేరు, చిరునామా, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం సెల్‌ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దాని తర్వాత హోం పేజీ వస్తుంది. అనంతరం లాగిన్ కావాలి. దీంతో 37 రకాల సేవలు పొందవచ్చు.

మీ సేవ 2.0 వెర్షన్ ద్వారా అందుతున్న సేవలు

గతంలో రాష్ట్ర ప్రభుత్వం టి -ఫోలియో యాప్ ద్వారా పలు సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో కొన్ని ఇబ్బందులు రావడంతో తాజాగా 1.0 సాఫ్ట్‌వేర్ నుంచి 2.0 వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం దీని ద్వారా 37 రకాల ప్రభుత్వ పౌర సేవలు ఇంటి వద్ద నుంచే పొందేందుకు వీలు కల్పించింది. ఇంటి నుంచే దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు ధ్రువపత్రాలను జారీ చేస్తారు. ఎస్‌ఎంఎస్ ద్వారా సెల్‌ఫోన్‌కి ఈ సమాచారం అందుతుంది. వెంటనే వినియోగదారుడు మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆ ధ్రువపత్రాన్ని పొందవచ్చు.

దీని ద్వారా ఆహార భద్రత, ఆదాయం, కులం, నివాసం, భూములకు సంబంధించిన ఆర్‌ఓఆర్, పహణీ తదితర ధ్రువపత్రాలతో పాటు 37 రకాల పౌర సేవలను పొందవచ్చు. ఈ సేవలకు గాను చెల్లించే రుసుం ఆన్‌లైన్ ఖాతా నుంచే చెల్లించవచ్చు. దీనిపై సందేహాలుంటే 1100, 18004251110 టోల్‌ఫ్రీ నంబర్‌ల ద్వారా లేదా 91210 06471, 91210 06472 వాట్సాప్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని జీటీ వెంకటేశ్వరరావు, కమిషనర్, మీ సేవ పేర్కొన్నారు.

మీ సేవల్లో ఇడబ్లుఎస్ సర్టిఫికెట్ల జారీ
దరఖాస్తు చేసుకున్న వారంరోజుల్లో ఇష్యూ,  సర్టిఫికెట్ కాలవ్యవధి ఏడాది మాత్రమే

అగ్రవర్ణ పేదలకు శుభవార్త. కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్రీయ విద్యాసంస్థల సీట్లలో ఆర్థిక, బలహీన వర్గాలు(ఈడబ్లూఎస్)కు రిజర్వేషన్లు పొందేందుకు వీలుగా ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్‌లను జారీ చేస్తున్నారు. దీనికి మీ సేవ రూపొందించిన ముసాయిదాపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ) ఆమోదముద్ర వేయడంతో ఈడబ్లూఎస్ సర్టిఫికెట్‌కు సంబంధించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అనంతరం అవి తహసీల్దార్ కార్యాలయానికి వెళతాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో మ్యానువల్‌గా సర్టిఫికెట్లను జారీ చేస్తుండగా తాజాగా ఆన్‌లైన్‌లో యూనిక్ నంబర్‌ను ఇవ్వనున్నారు.

కేంద్రీయ విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జనవరిలో చట్టం తీసుకొచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్లు కేంద్రీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే చెల్లుబాటు కానున్నాయి. దరఖాస్తు దారుల వివరాలు సేకరించేందుకు వీలుగా దరఖాస్తు రెండు పేజీలు ఉంటుంది. వేతనం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తికి సంబంధించిన ఆదాయాలు, వ్యవసాయ భూమి, ఇల్లు తదితర ఆస్తి వివరాలు పొందుపర్చాలి.

ఫోన్ నెంబర్, ఈ మెయిల్, ఆధార్, రేషన్ కార్డు సమాచారం కూడా రాయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ కాలవ్యవధి ఏడాది మాత్రమే. దరఖాస్తు చేసుకున్న వారంరోజుల్లో సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జాబితాలో లేని వారికి ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ పొందేందుకు అర్హులు. రెడ్లు, కమ్మ, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, బీసీ ఈ జాబితాలో లేని ముస్లిం కులాలు (సయ్యద్, మెఘల్, పఠాన్ (ఖాన్), ఇరానీ, అరబ్, బొహ్ర, షియా ఇమామీ, ఇస్మాయిలీ, ఖోజా, కచ్చి, మెమన్, జమాయత్, నవాయత్)లు సర్టిఫికెట్‌లు పొందడానికి అర్హులు.

Meeseva 2.0 Version Available

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మీ సేవ ‘2.0’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: