మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మీర్‌పేట ఎఎస్ఐ….. సస్పెండ్

రంగారెడ్డి: ఎఎస్‌ఐ ఓ కేసు విషయంలో బాధితుల ఇంటికి వెళ్లి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పని చేసే ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ నరేందర్ ఓ కేసు విషయంలో మహిళ ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన అనంతరం ఆమెతో నరేందర్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. షీ […] The post మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మీర్‌పేట ఎఎస్ఐ….. సస్పెండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: ఎఎస్‌ఐ ఓ కేసు విషయంలో బాధితుల ఇంటికి వెళ్లి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పని చేసే ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ నరేందర్ ఓ కేసు విషయంలో మహిళ ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన అనంతరం ఆమెతో నరేందర్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. షీ టీమ్స్ దర్యాప్తులో మహిళను లైంగికంగా వేధించినట్టు విచారణలో తేలడంతో సదరు ఎఎస్‌ఐను రాచకొండ సిపి మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. కేసుల విషయంలో మహిళలు దగ్గరికి వెళ్లిన పోలీసులు వెకిలి చేష్ఠలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.

 

Meerpet ASI misbhave with Women and suspended

The post మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మీర్‌పేట ఎఎస్ఐ….. సస్పెండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: