లక్ష్మీబ్యారేజీ 57 గేట్లు ఎత్తివేత

మేడిగడ్డ బ్యారెజ్ 57 గేట్ల ఎత్తివేత భారీగా ప్రాజెక్టులోకి చేరుతున్న వరద జలాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి మహారాష్ట్ర వరద జలాలు త్వరలో సరస్వతి ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత సరస్వతి జలాశయంలోకి భారీగా చేరుతున్న గోదావరి జలాలు మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీ పరవళ్లు తొక్కుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో వరదలు భారీగా గోదావరిలో చేరుతున్నాయి. రాష్ట్రంలో గోదావరి పరివాహాకప్రాంతాల్లోని జలాశయాల్లోకి వరద జలాలు వస్తుండటంతో అధికారులు జలాశయాల గేట్లు ఎత్తి వేస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న […] The post లక్ష్మీబ్యారేజీ 57 గేట్లు ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మేడిగడ్డ బ్యారెజ్ 57 గేట్ల ఎత్తివేత
భారీగా ప్రాజెక్టులోకి చేరుతున్న వరద జలాలు
గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి మహారాష్ట్ర వరద జలాలు
త్వరలో సరస్వతి ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
సరస్వతి జలాశయంలోకి భారీగా చేరుతున్న గోదావరి జలాలు

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీ పరవళ్లు తొక్కుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో వరదలు భారీగా గోదావరిలో చేరుతున్నాయి. రాష్ట్రంలో గోదావరి పరివాహాకప్రాంతాల్లోని జలాశయాల్లోకి వరద జలాలు వస్తుండటంతో అధికారులు జలాశయాల గేట్లు ఎత్తి వేస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు ప్రాణహిత నదిలో ప్రవేశించి ఉప్పొంగుతూ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం లక్ష్మీ బ్యారేజ్(మేడిగడ్డ)లో భారీగా నీరు చేరుతుండటంతో అధికారులు 57 గేట్లుఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు 85 గేట్లు ఉండగా ప్రస్తుతం 57 గేట్లు ఎత్తారు. వరదలు ఇలాగే కొనసాగితే మరో రెండురోజుల్లో మరో 10 గెట్లు ఎత్తివేసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. మేడిగడ్డ జలాశయం నీటి నిల్వ సామర్ధం 16.17 టిఎంసిలు ఉండగా ప్రస్తుతం 11.409 టిఎంసిల నీరు నిల్వ ఉంది. అయితే ప్రాజెక్టులోకి వరద ప్రవాహం 4,46,200 క్యూసెక్కులు ఉండగా దిగువకు 4,30,600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే మరో రెండురోజులు మహారాష్ట్ర భారీ వర్షసూచన ఉండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

అలాగే ప్రస్తుతం సరస్వతి బ్యారేజ్ కూడా నిండుకుండలా తలపిస్తోంది. ఈ ప్రాజెక్టులోకి కూడా ప్రవాహవేగం పెరిగింది. గురువారం గేట్లుఎత్తే అవకాశాలున్నాయని తెలిసింది. సరస్వతి జలాశయానికి 10.87 టిఎంసిల సామర్ధం ఉండగా ఇప్పటికే 9.93 టిఎంసిల నీరు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్‌ప్లో 27.500 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ప్లో 23.448 ఉంది. కేవలం ఒక్కటిఎంసి నీరు చేరితే ప్రాజెక్టు పూర్తి సామర్ధానికి చేరుకోనుంది. అలాగే గోదావరి పరివహాక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో శ్రీరాంసాగర్‌కు ఇన్‌ప్లో 14039 ఉండగా ఔట్‌ప్లో 3545 ఉంది. మిడ్ మానేరు ఇన్‌ప్లో 17741 ఉండగా ఔట్‌ప్లో 149 క్యూసెక్కులు ఉంది. లోయర్ మానేరులోకి 3153 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో 1232 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులోకి 303 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 851 క్యూసెక్కులను దిగువకు విడుదలచేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 29088 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 16372 క్యూసెక్కుల ఔట్ ప్లో ఉంది.

Medigadda Barrage 57 gates lifted due to heavy inflow

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post లక్ష్మీబ్యారేజీ 57 గేట్లు ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: