రూపాయికే రక్తం, మూత్రం, బీపీ పరీక్షలు…

  అనాథల కోసం నైట్ షెల్టర్స్ పేదవారికి ఉచితంగా రీసైక్లింగ్ పాదరక్షలు నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ : నగర పరిశుభ్రత, మంచి నీటి సరఫరా చేయడమే కాదు నగర ప్రజలకు వైద్యం అందించడం కూడా మున్సిపాలిటీ బాధ్యత అని నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. శనివారం నగరంలోని గీతాభవన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నగర ప్రజలకు మౌళిక వసతులు కల్పించడమే కాకుండా నగరపాలక […] The post రూపాయికే రక్తం, మూత్రం, బీపీ పరీక్షలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అనాథల కోసం నైట్ షెల్టర్స్
పేదవారికి ఉచితంగా రీసైక్లింగ్ పాదరక్షలు
నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్

కరీంనగర్ : నగర పరిశుభ్రత, మంచి నీటి సరఫరా చేయడమే కాదు నగర ప్రజలకు వైద్యం అందించడం కూడా మున్సిపాలిటీ బాధ్యత అని నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. శనివారం నగరంలోని గీతాభవన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నగర ప్రజలకు మౌళిక వసతులు కల్పించడమే కాకుండా నగరపాలక సంస్థ చట్టంలో చెప్పిన విధంగా విద్యా, వైద్యం అందించడం కార్పొరేషన్ బాధ్యత అని అన్నారు. కరీంనగర్ ప్రజలకు చేరువయ్యే విధంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పథకాలు చేపట్టామన్నారు.

పేద ప్రజల కోసం నగరపాలక సంస్థలో ఒక మెడికల్ ఆఫీసర్ నియామకం చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారన్నారు. ఈ వైద్య అధికారి ఆదీనంలో నగరపాలక కార్యాలయంలో 1 రూపాయికే రక్తం, మూత్రం, బీపీ పరీక్షలు చేయిస్తామన్నారు. ఒక పిహెచ్ కేంద్రం, అందులో ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. నగరపాలక సంస్థలో చిన్నచిన్న వైద్యపరీక్షలు చేయిస్తామన్నారు. ఈ పథకానికి ఇప్పటికీ తీర్మాణం చేశామని, త్వరలో పథకాన్ని ప్రవేశపడతామన్నారు. పేద ప్రజల కోసం భూట్ హౌస్ నిర్మాణం చేయిస్తామన్నారు. ఈ పాద రక్షక కేంద్రం లో పాత చెప్పులను రీసైక్లింగ్ చేసి పేదవారికి పాదరక్షలు ఉచితంగా అందిస్తామన్నారు. ఎవరైనా పాత చెప్పులు వాడకుండా ఉన్న వారు నగరపాలక సంస్థ సమాచారం ఇవ్వాలన్నారు.

ఎలాంటి భరోసా లేని వృద్ధులు, అనాథల కోసం నైట్ షెల్టర్స్ ఏర్పాటే చేశామన్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం నగరంలోని క మ్యూనిటీ హాల్ భవనాల్లో నగరపాలక సంస్థ ద్వారా లైబ్రరీలను ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో 3 నుండి 5 వరకు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా టీఎస్‌పీఎస్సీ వారి సహకారంతో పోటీ పరీక్షల శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కార్యచరణ చేస్తున్నామన్నారు. ఈ విషయంపై ఛైర్మన్ గంట చక్రపాణి ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

విద్యార్థుల కోసం సరస్వతి ప్రసాదం, ఒక రూపాయికే నల్లా కనెక్షన్, రూపాయికే అంతిమ యాత్ర, మహిళ విద్యార్థుల కోసం హాస్టల్స్‌లో సానిటేషన్ నాప్కిన్ వెండర్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, భవన నిర్మాణాలు, విద్యార్థులకు అవసరమ య్యే వస్తువుల పంపిణీ, ఇంకుడు గుంత నిర్మాణం లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజలు నగరపాలక సంస్థకు పన్నుల రూపంలో అందిస్తున్న డబ్బు దుర్వినియోగం కాకుండా ప్రజలకు సంక్షేమ పథకాల ప్రవేశపెడుతున్నామన్నారు. అభివృద్ధి ఫలాలు అందించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్షం అన్నారు. సమావేశంలో కార్పొరేటర్ లంక రవీందర్, టిఆర్‌ఎస్ నాయకులు సాదవేణి శ్రీనివాస్, మైఖేల్ శ్రీనివాస్, హరిప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు.

Medical tests for poor people to Rupee

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రూపాయికే రక్తం, మూత్రం, బీపీ పరీక్షలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: