చెక్‌డ్యాంల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

Check Damsవెల్దుర్తి (మెదక్) : చెక్‌డ్యాంల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వెల్దుర్తి మండల పరిధిలోని హల్దివాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని హకీంపేట గ్రామ పరిధిలోని ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడ నీటి నిల్వ సామర్థ్యం గురించి నీటిపారుదల శాఖ ఈఈ యేసయ్య కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఉప్పులింగాపూర్ గ్రామంలోని హాల్దీవాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణాన్ని పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీపడకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వస్తున్నందున ఆలోపు నిర్మాణాలకు సంబంధించిన పనులను పూర్తి చేయాలన్నారు. వర్షాలు కురిసిన నీరు నిల్వ ఉండేందుకుగాను పనులను వేగవంతం చేసి నిర్మాణాలను ఆగష్టు నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌లను, అధికారులను ఆదేశించారు. అనంతరం దామరంచ గ్రామంలో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వెల్దుర్తి గ్రామ శివారులో నిర్మించాల్సిన చెక్‌డ్యాం పనులు సైతం త్వరలో ప్రారంభించాలని సూచించారు. అలాగే మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న రైతు సమగ్ర సమాచార సర్వేను సందర్శించడం జరిగింది. రైతులందరు పూర్తి వివరాలతో వ్యవసాయ అధికారులకు తెలియజేయాలన్నారు. ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇరిగేషన్ ఈఈ యేసయ్య, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కరుణ, జిల్లా వ్యవసాయ అధికారి పరుశరాం నాయక్, వ్యవసాయ సహయ సంచాలకులు ఆదిలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి మాలతీ, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయి, గౌతమి, గ్రామసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Medak Collector Checks the Check Dams

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చెక్‌డ్యాంల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.