మోడీపై మాయావతి వ్యక్తిగత వ్యాఖ్య

   ఆయనను తమ భర్తలు కలిస్తే తమను వదిలేస్తారని బిజెపి మహిళలు భయపడుతున్నారంటూ ఎద్దేవా  బిఎస్‌పి అధినేత్రిపై మండిపడిన బిజెపి లక్నో/ గోరఖ్‌పూర్: బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు.తమ భర్తలు మోడీని కలిసేందుకు వెడతామంటే బిజెపిలో పెళ్లయిన మహిళలు భయపడుతున్నారని, మోడీలాగా వారు కూడా భార్యలను వదిలేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఒక పత్రికా ప్రకటన చేస్తూ మాయావతి ‘ఇలాంటి పరిస్థితుల్లో […] The post మోడీపై మాయావతి వ్యక్తిగత వ్యాఖ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 ఆయనను తమ భర్తలు కలిస్తే తమను వదిలేస్తారని బిజెపి మహిళలు భయపడుతున్నారంటూ ఎద్దేవా
 బిఎస్‌పి అధినేత్రిపై మండిపడిన బిజెపి

లక్నో/ గోరఖ్‌పూర్: బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు.తమ భర్తలు మోడీని కలిసేందుకు వెడతామంటే బిజెపిలో పెళ్లయిన మహిళలు భయపడుతున్నారని, మోడీలాగా వారు కూడా భార్యలను వదిలేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఒక పత్రికా ప్రకటన చేస్తూ మాయావతి ‘ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని మహిళలందరికీ నా విన్నపం ఏమిటంటే అలాంటి మనిషికి ఓటేయకండి. మోడీ వదిలేసిన భార్యపట్ల నిజంగా గౌరవం చూపించాలంటే ఇదొక్కటే మార్గం’ అని అభిప్రాయపడ్డారు. అల్వార్ సామూహిక అత్యాచారంపై మోడీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ ఈ వ్యవహారంలో ఆయన సైలెంట్‌గా ఉండిపోయారన్నారు. ప్రతిపక్షం ఆయన పట్ల అమర్యాదకరమైన భాషను ఉపయోగిస్తున్నదంటే …అందుకు మోడీ అర్హులేనన్నారు. ‘ఎన్నికల్లో తన పార్టీ విజయంకోసం దీన్ని సాకుగా తీసుకొని చెత్త రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన సంగతి. రాజకీయ ప్రయోజనాలకోసం సొంత భార్యనే వదులుకున్న వ్యక్తి ఆడపడుచుల్ని, భార్యలను, ఇతరులను ఎలా గౌరవించగలరు?’ అని బిఎస్‌పి అధినేత ప్రశ్నించారు. అల్వార్ సంఘటనకు తమ పార్టీ బాధపడుతోందని, సరైన చర్య తీసుకోని రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే అంశాన్ని కూడా ఆలోచిస్తోందని అన్నారు.
ప్రజా జీవితానికి పనికి రాదు: జైట్లీ
ప్రధాని మోడీపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రజాజీవితానికి రాదు అని విమర్శించారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాయావతి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘రాజస్థాన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం సంఘటనపై మోడీ అడిగిన రాజకీయ ప్రశ్నలకు జవాబివ్వడం మానేసి ఆయనపై వ్యక్తి గత దూషణలకు పాల్పడుతున్నారు. ఆమె ప్రధానికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Mayawati’s personal comment on PM Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోడీపై మాయావతి వ్యక్తిగత వ్యాఖ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: