వివాహితపై సామూహిక అత్యాచారం

  రఘునాథపాలెం: ఓ వివాహితపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన రఘునాథపాలెం మండల పరిధిలోని హర్యాతండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బద్యాతండాకు చెందిన వివాహిత భర్తతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చి ఆమెను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారు. వాహనం అలికిడి కావడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి అనుమానం వచ్చి వారిని వెంబడించారు. ఆ గ్రామ సమీపంలోని పత్తి చేనులోకి మహిళను తీసుకెళ్లడం […] The post వివాహితపై సామూహిక అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రఘునాథపాలెం: ఓ వివాహితపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన రఘునాథపాలెం మండల పరిధిలోని హర్యాతండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బద్యాతండాకు చెందిన వివాహిత భర్తతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చి ఆమెను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారు. వాహనం అలికిడి కావడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి అనుమానం వచ్చి వారిని వెంబడించారు. ఆ గ్రామ సమీపంలోని పత్తి చేనులోకి మహిళను తీసుకెళ్లడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, స్థానికులు పత్తి చేనులోకి వెళ్లి చూడగా అప్పటికే అక్కడి నుంచి యువకులు పరారయ్యారు. బాధిత వివాహితను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సుకినితండాకు చెందిన అశోక్, సునీల్, హర్యాతండాకు చెందిన మోహన్, ఉపేందర్, కళ్యాణ్, చంటి, నాగేశ్వరరావులు మద్యం మత్తులో వివాహితను ఇంట్లో నుంచి అపహరించి పత్తి చేనులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, పోలీసులు రావడంతో వారు పరారయ్యారని బాధిత వివాహిత బంధువులు పోలీసులకు వివరించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు. ఘటనాస్థలిని అడిషనల్ డిసిపి పూజ, సిఐలు సత్యనారాయణరెడ్డి, అంజలి, రఘునాథపాలెం ఎస్‌ఐ సంతోష్ తదితరులు సందర్శించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ డిసిపి పూజ తెలిపారు.

Mass rape on Married Woman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివాహితపై సామూహిక అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: