ముగిసిన మారుతీ రావు అంత్యక్రియలు

నల్లగొండ: మిర్యాలగూడలో సోమవారం మధ్యాహ్నం మారుతీరావు అంత్యక్రియలు ముగిశాయి. తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటికకు అమృత వచ్చింది. అమృత గో బ్యాక్ అంటూ బంధువులు, స్థానికులు నినాదాలు చేయడంతో వెనుదిరిగారు. తండ్రి మృతదేహాన్ని కడసారి చూడకుండానే అమృత వెనుదిరిగింది. తన కూతురిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని అల్లుడు ప్రణయ్ ను మారుతీ రావు చంపించిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ ఆర్యవైశ్య భవన్ లో మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు.  మారుతీ రావు ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టు […] The post ముగిసిన మారుతీ రావు అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: మిర్యాలగూడలో సోమవారం మధ్యాహ్నం మారుతీరావు అంత్యక్రియలు ముగిశాయి. తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటికకు అమృత వచ్చింది. అమృత గో బ్యాక్ అంటూ బంధువులు, స్థానికులు నినాదాలు చేయడంతో వెనుదిరిగారు. తండ్రి మృతదేహాన్ని కడసారి చూడకుండానే అమృత వెనుదిరిగింది. తన కూతురిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని అల్లుడు ప్రణయ్ ను మారుతీ రావు చంపించిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ ఆర్యవైశ్య భవన్ లో మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు.  మారుతీ రావు ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టు వైద్యులు విడుదల చేశారు. మారుతీ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆయన శరీరం రంగు మారడానికి విషమే కారణమని, విషం తీసుకోవడం వల్లే మారుతీ రావు చనిపోయినట్టు నిర్ధారించామని ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. మారుతీ రావు నుంచి విస్త్రా నమూనాలు సేకరించామని, విస్రా నమూనాలతో ఆయన తీసుకున్న విషం వివరాలు తెలుస్తుందని వైద్యులు వెల్లడించారు.

Amruta came to the cemetery to see her father. Amrita Go Back was backed by relatives
and locals chanting. Amruta retreated without ever seeing her father’s body.

 

Maruti Rao funeral completed in Miryalaguda

The post ముగిసిన మారుతీ రావు అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: