డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘మార్షల్’

Marshall

 

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “అభయ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. అతను హీరోగానే కాకుండా ఈ సినిమాతో నిర్మాతగా ఒక అడుగు ముందుకు వేయడం సంతోషంగా ఉంది”అని అన్నారు.

హీరో అభయ్ మాట్లాడుతూ “సినిమా గ్రాండ్ గా వచ్చింది. నేను బాగా నటించడానికి శ్రీకాంత్ సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్… ఇలా అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. శ్రీకాంత్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారని నమ్ముతున్నాను”అని చెప్పారు.

దర్శకుడు జయరాజ్ సింగ్ మాట్లాడుతూ “మా హీరో, నిర్మాత అభయ్‌కు ఈ కథ చెప్పినప్పుడు వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్‌కి థాంక్స్. కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సుర్, హీరోయిన్ మేఘ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Marshall Movie with a different Concept

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘మార్షల్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.