వివాహిత ఆత్మహత్య…

Married committed suicide in karimnagar

కరీంనగర్: మండలంలో ఓ వివాహిత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చెసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన నేదురు సదయ్య కూతురు అనూష(19) గురువారం భర్త నూనె రాజేష్ తో కలిసి తన పుట్టింటికి వచ్చింది. శుక్రవారం ఉదయం రాజేష్ స్వగ్రామమైన గంగిపెల్లికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటికి వెళ్లిపోవడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి సదయ్య తన కూతురు కడుపునొప్పితో బాధపడేదని కడుపునొప్పి భరించలేక మృతి చెందిందాని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.