సారపాకలో భారీగా గంజాయి స్వాధీనం

బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ డిఎస్‌పి కెఆర్‌కె ప్రసాదరావు, సిఐ నవీన్‌తో కలిసి గురువారం బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సారపాక ప్రధాన కూడలిలో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు వద్ద ఉన్న వెదురు బుట్టలను పోలీసులు తనిఖీ చేశారు. ప్లాస్టిక్ బొమ్మల కింద ఉంచిన 301 కిలోలు గంజాయి పొట్లాలను గుర్తించారు. వీటి […] The post సారపాకలో భారీగా గంజాయి స్వాధీనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ డిఎస్‌పి కెఆర్‌కె ప్రసాదరావు, సిఐ నవీన్‌తో కలిసి గురువారం బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సారపాక ప్రధాన కూడలిలో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు వద్ద ఉన్న వెదురు బుట్టలను పోలీసులు తనిఖీ చేశారు.

ప్లాస్టిక్ బొమ్మల కింద ఉంచిన 301 కిలోలు గంజాయి పొట్లాలను గుర్తించారు. వీటి విలువ మార్కెట్లో రూ. 45.15 లక్షల ఉంటుందని డిఎస్‌పి తెలిపారు. 17 వెదురు బుట్టల్లో 92 గంజాయి ప్యాకెట్టు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రం లుథియానా జిల్లా కిల్లామొహల్లా గ్రామానికి చెందిన రాము, అతని భార్య భీమ్ల, ఓంపతి ముగ్గురూ కలిసి ఓడిశా రాష్ట్రంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి కరీంనగర్ మీదుగా స్వస్థలానికి తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని డిఎస్‌పి వెల్లడించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు.

Marijuana Seized At Khammam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సారపాకలో భారీగా గంజాయి స్వాధీనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: