రోడ్డు ప్రమాదంలో మరాఠీ గాయని గీతా మాలి మృతి

Marathi Singer Geeta Maliముంబయి : ప్రముఖ మరాఠీ సినీ గాయని గీతా మాలి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ముంబై-ఆగ్రా హైవేలో కారులో తన భర్త విజయ్ తో వస్తున్న సమయంలో కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు నెలల టూర్ కోసం వారు అమెురికా వెళ్లి, శుక్రవారం తెల్లవారుజామున ఇండియాకు వచ్చారు. ముంబయిలో వారు దిగగానే తమ ఊరైన నాసిక్ కు బయల్దేరారు. ఈ క్రమంలో హైవేపై జరిగిన ప్రమాదంలో గీత మాలి, ఆమె భర్త తీవ్రంగా గాయపడడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గీతా మాలి చనిపోయారు. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గీతా మాలి మరాఠీ సినిమాల్లో వేలాది పాటలు పాడారు. పలు మ్యూజిక్ ఆల్బమ్ లను కూడా ఆమె రూపొందించారు.

Marathi Singer Geeta Mali Dies In Road Accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో మరాఠీ గాయని గీతా మాలి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.