ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు హల్ ఛల్

భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు హల్ ఛల్ చేశారు. సుమారు 150 నుండి 200 వరకు సాయుధులైన మావోయిస్టులు ఆ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా భాంసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్లీ గ్రామ శివారులో ఆయుధాలతో రోడ్డుపైకి వచ్చి భీభత్సం సృష్టించారు. ప్రయాణికులతో వెళుతున్న రెండు బస్సులను రోడ్డుకు అడ్డంగా వచ్చి ఆయుధాలను చూపుతూ ఆపేశారు. దీంతో భయభ్రాంతులకు గురైన డ్రైవర్ ఒక్క సారిగా బస్సును ఆపేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్సులోని ప్రయాణికులంతా దిగిపోవాలని మావోయిస్టులు […]

భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు హల్ ఛల్ చేశారు. సుమారు 150 నుండి 200 వరకు సాయుధులైన మావోయిస్టులు ఆ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా భాంసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్లీ గ్రామ శివారులో ఆయుధాలతో రోడ్డుపైకి వచ్చి భీభత్సం సృష్టించారు. ప్రయాణికులతో వెళుతున్న రెండు బస్సులను రోడ్డుకు అడ్డంగా వచ్చి ఆయుధాలను చూపుతూ ఆపేశారు. దీంతో భయభ్రాంతులకు గురైన డ్రైవర్ ఒక్క సారిగా బస్సును ఆపేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్సులోని ప్రయాణికులంతా దిగిపోవాలని మావోయిస్టులు హెచ్చరించి, బస్సు ఆయిల్ ట్యాంకర్లను పగులగొట్టి నిప్పంటించారు. దీంతో రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు వారికి చెందిన లగేజీకీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అంతే కాకుండా గురువారం రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఓ ప్రొక్లైనర్‌ను కూడా డీజిల్ పోసి నిప్పంటించినట్లు తెలుపారు. అనంతరం ఆ ప్రాంతంలో మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలు వడిచి వెళ్లారు.

ఎస్‌ఆర్, జిందాల్, టాటా, ఆదాని కంపెనీలపై దాడులు తప్పవని హెచ్చరించారు. దీంతో మరో సారి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోల అలజడి మొదలైనట్లు అయింది. గత నాలుగు రోజుల క్రితం ఇదే రాష్ట్రంలో సుమారు 15 మంది మావోయిస్టులను పోలీసులు మట్టు పెట్టారు. మావోయిస్టులు హింసాత్మక సంఘటనకు పాల్పడంతో అటు అటవీ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే దళాల సమాచారానిన చెప్పాలంటే అనేక ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క దళాల సమాచారాన్ని పోలీసులకు చేరావేస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ మావోయిస్టులు సైతం గ్రామ గ్రామాన హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు వినికిడి. అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల నడుమ ప్రతీ సారి సమిదలయ్యేది మాత్రం ఆదివాసులే.

మావోయిస్టులు రెండు బస్సులు, ప్రొక్లైన్‌ను దగ్ధం చేయడంతో ఆ రాష్ట్ర పోలీసులు పొరుగున్న నాలుగు రాష్ట్రాల పోలీసు శాఖలను కూడా అప్రమత్తం చేసింది. మావోలు మారోసారి ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయనే నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో సరిహద్దు ప్రాంతాలతో పాటు కూడళ్లను స్వాదీనంలోనికి తీకుని, పెద్ద ఎత్తున అడవుల్లో కూంబింగ్‌లు చేపడుతూ అడవులను జల్లెడ పడుతున్నారు.

Comments

comments

Related Stories: