రాజ్యసభకు మన్మోహన్‌సింగ్ నామినేషన్

Manmohan-Singh
జైపూర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థిగా జైపూర్ నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగ్ వెంట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. బిజె పి నేత మదన్ లాల్ సైనీ మృతితో రాజ్యసభకు ఉప ఎన్నిక అవసరమైం ది. మూడు దశాబ్దాలుగా అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహించిన సింగ్ పదవీ కాలం జూన్ 14తో ముగిసింది. నామినేషన్ దాఖలుకు ఆగస్టు 14 చివరి తేదీ కాగా, ఈ నెల 26న అవసరమైతే ఎన్నికల నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు.

Manmohan Singh Files Nomination For Rajya Sabha

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాజ్యసభకు మన్మోహన్‌సింగ్ నామినేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.