ఇంటివాడైన మనీష్ పాండే

Manish Pandey

 

ముంబై : టీమిండియా స్టార్ క్రికెటర్ మనీష్ పాండే ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం ముంబైలో మనీష్ పాండే తన స్నేహితురాలు, సినీ నటి ఆశ్రిత శెట్టిని వివాహమాడాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మనీష్, ఆశ్రితలు వివాహ బంధంతో ఒక్కటయ్యారని తెలిసింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆదివారం జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్వంటీ20 టోర్నమెంట్ ఫైనల్లో మనీష్ పాండే మెరుపులు మెరిపించాడు. అద్భుత బ్యాటింగ్‌తో కర్నాటకకు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, కొంతకాలంగా మనీష్, ఆశ్రితలు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే.

Manish Pandey Married with Ashritha

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంటివాడైన మనీష్ పాండే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.