ముగిసిన మానేరు క్యాట్-2019 పరీక్ష…

  కరీంనగర్ : మానేరు విద్యాసంస్థల ఆధ్వార్యంలో రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని ఆలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్, స్పేస్ ఐఐటీ ఫౌండేషన్ సౌజన్యంతో ఆదివారం కరీంనగర్‌లో జరిగిన క్యాట్ (కంప్లీట్ అకాడమిక్ అనాలసీస్)-2019 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పద్మానగర్‌లోని మానేరు సెంట్రల్ స్కూల్, మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో పరీక్షలు జరుగగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1150 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు జరుగుతున్న తీరును మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన […] The post ముగిసిన మానేరు క్యాట్-2019 పరీక్ష… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్ : మానేరు విద్యాసంస్థల ఆధ్వార్యంలో రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని ఆలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్, స్పేస్ ఐఐటీ ఫౌండేషన్ సౌజన్యంతో ఆదివారం కరీంనగర్‌లో జరిగిన క్యాట్ (కంప్లీట్ అకాడమిక్ అనాలసీస్)-2019 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పద్మానగర్‌లోని మానేరు సెంట్రల్ స్కూల్, మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో పరీక్షలు జరుగగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1150 మంది విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్షలు జరుగుతున్న తీరును మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ క్యాట్ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై తమ మేథస్సుకు పదును పెట్టారన్నారు. భవిష్యత్తులో అందరూ ఐఐటీ, మెడికల్ ఫౌండేషనల్ కోర్సులపై దృష్టి సారిస్తున్నారని, దేశంలోనే అతిపెద్ద క్లాస్ రూం ఇన్‌స్టిట్యూట్ అయిన అలెన్ కెరీర్ విద్యాబోధన కేవలం కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థలలో జరుగుతుందన్నారు.

ఈ క్యాట్ పరీక్షలో తరగతుల వారిగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుందని అదే విధంగా తొలి పది స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పాఠశాల ఫీజులో రాయితీతో పాటు ఉచిత విద్యాబోధన అందించనున్నట్లు పేర్కొన్నారు. క్యాట్-2019 ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్స్ రాజు చాకో, నారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Maneru cat test was compleated

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముగిసిన మానేరు క్యాట్-2019 పరీక్ష… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: