నేడు కూకట్‌పల్లిలో మానేపల్లి జ్యువెల్లరీ షోరూం ప్రారంభం

Manepally-Jewellers
ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీతార నిధిఅగర్వాల్

కెపిహెచ్‌బి: ప్రపంచ పేరుగాంచిన ప్రముఖ మానెపల్లి జ్యువెల్లరీ సంస్థ నగరంలో 3వ షో రూమ్‌ను కూకట్‌పల్లిలో నేడు ప్రారంభించనున్నది. సరికొత్త మోడల్స్, సంప్రదాయ అభరణాలకు మారుపేరుగా నిలిచిన మానేపల్లి జ్యువెల్లరీస్ షోరూమ్‌ను కూకట్‌పల్లిలో ముఖ్యఅతిథిగా నటి నిధి అగర్వాల్ నేడు(శుక్రవారం) ప్రారంభించనున్నారు. కాగా గురువారం మానేపల్లి జ్యువెల్లరీస్ షో రూంలో సినీనటి ‘రాజా వారు రాణిగారు’ ఫేం రహష్య గోరక్, వారి చిత్ర బృదం విచ్చేసి టేబుల్ కౌంటర్స్‌ని ప్రారంభించి ఇంటర్నల్ ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఇందులో సినీ నటి రహస్య గోరక్, వారి బృదం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మానేపల్లి జ్యూవెల్లరీస్ డైరెక్టర్ మురళి కృష్ణ, గోపికృష్ణ మాట్లాడుతూ నేడు (శుక్రవారం) సినీనటి నిధి అగర్వాల్ చేతులమీదుగా జ్యూలరీ షో రూమ్ ప్రారంభం కానున్నది అని తెలిపారు. నమ్మకానికి పేరు, నాణ్యతకు చిహ్నం మానేపల్లి జ్యూవెల్లరీస్ అని, ఇక్కడ టెంపుల్ జ్యూవెల్లరీ, కుందన్ జ్యూవెల్లరీ, ట్రడిషనల్ గోల్డ్ జ్యూవెల్లరీ, బ్రైడల్ జ్యూలరీ, ప్లాటినం ఆభరణాలు అన్నిరకాల మోడల్స్ కలిగి కచ్చితమైన అతి తక్కువ ధరకే లభిస్తాయని, తెలుగు ప్రజల ఇష్టాలకు అనుగుణంగా అభరణాలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో వివిధ రకాల బంగారు ఆభరణాలు, గోల్డ్ కుందన్, డైమండ్ స్టోన్, ష్యాషన్ జ్యువెల్లరీ అందుబాటులో ఉంటాయన్నారు. వీటితో పాటు చేతితో తయారు చేసిన నెక్లస్, చెవి రింగులు, దుద్దులు, బ్రేస్‌లెట్, ఆర్మ్‌బ్రాండ్, చైన్‌లు తదితర ఆభరణాలతో పాటు మహిళల కోసం ప్రత్యేకించి తయారు చేసినట్లు చెప్పారు.

Manepally Jewellers Showroom opened in Kukatpally today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు కూకట్‌పల్లిలో మానేపల్లి జ్యువెల్లరీ షోరూం ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.