సీనియర్ సిటిజన్లకు క్రీడా పోటీలు నిర్వహణ

 senior citizens

 

పలు సర్కిళ్లలో పెద్ద ఎత్తున పాల్గొన్న సీనియర్ సిటీజన్లు
ఆసరా సెంట్రల్ కమిటీ ఏర్పాటుకు ఎన్నికలు ః దానకిషోర్

హైదరాబాద్‌ : గ్రేటర్ హైదరాబాద్‌లోని సీనియర్ సిటిజన్లకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బుధవారం వివిధ విభాగాల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో పెద్దసంఖ్యలో సీనియర్ సిటీజన్లు పాల్గొన్ని విజయవంతం చేశారు. ఎల్బీనగర్ జోన్‌పరిధిలోని ఐదు సర్కిళ్లకు గడ్డి అన్నారంలోని సాయి పంక్షన్‌హాల్‌లో, ఇతర జోన్ల పరిధిలోని చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్‌లో క్రీడా పోటీలు నిర్వహించారు.

క్యారమ్, చెస్, లెమన్‌స్పూన్,బ్రిస్క్ వాకింగ్, మ్యూజికల్ చైర్, మైండ్‌గేమ్ తదితర అంశాలలో నిర్వహించిన క్రీడా పోటీలకు ఎల్బీనగర్‌లో దాదాపు 250మంది, చాదర్‌ఘాట్‌లో 150మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటిసారి సీనియర్ సిటీజన్ల క్రీడలు నిర్వహించి తగు గౌరవం ఇచ్చిందన్నారు. చాదర్‌ఘాట్‌లో నిర్వహించిన పోటీల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ మమత గుప్తాలు ప్రారంభించారు. విజేతకు నేడు (గురువారం ) బహుమతులు ప్రధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆసరా సెంట్రల్ కమిటీ ఏర్పాటుకు ఎన్నికల నిర్వహణ ః దానకిషోర్
సీనియర్ సిటీజన్ల సంక్షేమం, వారి సేవలను సముచిత రీతిలో వినియోగించుకునేందుకు చేపట్టిన చర్యలో భాగంగా త్వరలో ఆసరా సెంట్రల్ కమిటీ ఏర్పాటుకు ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో క్రీడాలకు హాజరై అనంతరం మాట్లాడుతూ సర్కిల్ స్దాయిలో ఉన్న ఆసరా కమిటీలను పునరుద్దరించి త్వరలో సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

దేశంలోని మెట్రో నగరాలను పోల్చితే హైరదాబాద్ నగరంలో సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆసరా గుర్తింపుకార్డులతో పాటు, పలు రాయితీలు కూడా కల్పిస్తామన్నారు. ఈసందర్భంగా దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలిపే కరపత్రాన్ని ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్యశిభిరాన్ని ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి మొక్కలు పంపిణీ చేశారు.

Management of sports competitions for senior citizens

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సీనియర్ సిటిజన్లకు క్రీడా పోటీలు నిర్వహణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.