కరీంనగర్ లో దారుణం.. తొమ్మిది నెలల గర్భావతిపై అత్యాచారం

Man raped pregnant woman

కరీంనగర్: అత్యంత దారుణంగా దిశను అత్యాచారం చేసి, హత్యచేసిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన తొమ్మిది నెలల గర్భావతిపై ఓ కామాందుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లాలోని బొమ్మకల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామం జిల్లాకు దగ్గరలో ఉండడంతో భర్త సెక్యూరిటీ గార్డ్ గా జిల్లా కేంద్రంలో డ్యూటీ చేస్తున్నాడు. భర్త రోజూ జిల్లా కేంద్రానికి వెళ్లి.. విధులు నిర్వహించి సాయంత్రానికి ఇంటికి వెళ్లేవాడు. ఈ సమయంలో గర్భావతి అయిన తన భార్య ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో కేబుల్ నెట్ వర్క్ లో పనిచేస్తున్న కె రామకృష్ణ అనే వ్యక్తి వారింటికి వెళ్లాడు. అయితే, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రామకృష్ణ.. గర్భావతి అని కూడా కనికరం లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త, భార్య మొఖంలో సంతోషం లేకపోవడంతో ఏం జరిగిందని అడిగగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Man raped pregnant woman in Karimnagar

The post కరీంనగర్ లో దారుణం.. తొమ్మిది నెలల గర్భావతిపై అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.