భూ తగాదాల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య

జగిత్యాల : బుగ్గారం మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల కారణంగా దుండిగల రమేష్ (45) అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కొన్నేళ్లుగా రమేష్, అతని అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు నడుస్తున్నాయి. శనివారం ఉదయం రమేష్ పొలం దగ్గరకు వెళ్లాడు. అక్కడే మాటువేసి ఉన్న రమేష్ అన్న, అన్న అల్లుడు, మరికొంతమంది కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. […]

జగిత్యాల : బుగ్గారం మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల కారణంగా దుండిగల రమేష్ (45) అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కొన్నేళ్లుగా రమేష్, అతని అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు నడుస్తున్నాయి. శనివారం ఉదయం రమేష్ పొలం దగ్గరకు వెళ్లాడు. అక్కడే మాటువేసి ఉన్న రమేష్ అన్న, అన్న అల్లుడు, మరికొంతమంది కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం రమేష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Murder in Jagtial

Comments

comments

Related Stories: