తల…మొండెం వేరు చేసి…

ఒడిశా : సంబల్ పూర్ జిల్లాలోని బాలుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ (40) అనే వ్యక్తి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో  దుండగులు కత్తులతో పొడిచి చంపారు. అనంతరం ఆయన తలను నరికి పట్టుకెళ్లారు. ఈ ఘటనపై సత్యనారాయణ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతకక్షల కారణంగానే దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం […] The post తల… మొండెం వేరు చేసి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఒడిశా : సంబల్ పూర్ జిల్లాలోని బాలుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ (40) అనే వ్యక్తి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో  దుండగులు కత్తులతో పొడిచి చంపారు. అనంతరం ఆయన తలను నరికి పట్టుకెళ్లారు. ఈ ఘటనపై సత్యనారాయణ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతకక్షల కారణంగానే దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం సత్యనారాయణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Man Murder In Balupally At Odisha

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తల… మొండెం వేరు చేసి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.