పెద్దపల్లి: మద్యం మత్తులో అతి దారుణంగా మిత్రుడిని చంపేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో జరిగింది. పూటుగా మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు మాటమాట పెరిగి వారితో వచ్చిన స్నేహితుడిని హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Comments
comments