జాబ్ ఇప్పిస్తానని…యువతితో కారులో జంప్

రంగారెడ్డి: ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని మోసం చేయడమేకాకుండా కిడ్నాప్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఇబ్రహీంపట్నం ప్రాంతం బొంగులూరు గేటు వద్ద చోటుచేసుకుంది. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి లాగ్జరీ కారులో వచ్చి చిరు వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. తన సొదరుడు పోలీస్ కమిషనర్, తన తండ్రి హైకోర్టు లాయర్, తన మదర్ ఉస్మానియా ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తోందని నమ్మబలికాడు. తన ఎంతో మందికి జాబ్ ఇప్పించానని చిరువ్యాపారితో చెప్పాడు. దీంతో […] The post జాబ్ ఇప్పిస్తానని… యువతితో కారులో జంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని మోసం చేయడమేకాకుండా కిడ్నాప్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఇబ్రహీంపట్నం ప్రాంతం బొంగులూరు గేటు వద్ద చోటుచేసుకుంది. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి లాగ్జరీ కారులో వచ్చి చిరు వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. తన సొదరుడు పోలీస్ కమిషనర్, తన తండ్రి హైకోర్టు లాయర్, తన మదర్ ఉస్మానియా ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తోందని నమ్మబలికాడు. తన ఎంతో మందికి జాబ్ ఇప్పించానని చిరువ్యాపారితో చెప్పాడు. దీంతో తన కూతురు బిటెక్ చదవిందని ఉద్యోగం ఇప్పించాలని ప్రాదేయపడ్డాడు. అతడి మాటలను నమ్మిన ఆ కుటుంబం అతడి కారు ఎక్కి సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్లారు. కాలేజీ అడ్మిన్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన అధికారి లేకపోవడంతో తెలంగాణ సచివాలయం అధికారులతో మాట్లాడుతానంటూ హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. తరువాత సాయంత్రం కావడంతో చిరువ్యాపారి తనయుడిని బిఎన్‌రెడ్డిలో డ్రాప్ చేసిన అనంతరం సర్టిఫికెట్స్ జిరాక్స్‌లు కావాలని చిరువ్యాపారిని అడిగాడు. చిరువ్యాపారి కారు దిగగానే అమ్మాయిని తీసుకొని వెళ్లిపోయాడు. చిరు వ్యాపారి ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి వయసు 35 సంవత్సరాలు ఉంటాయని బాధితుడు వెల్లడించాడు.

The post జాబ్ ఇప్పిస్తానని… యువతితో కారులో జంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: