పేగులు బయటపడిన …. 11కిలో మీటర్లు నడిచి

కాజీపేట: ఓ వ్యక్తి రైలు నుంచి కింద పడడడంతో పేగులు బయటపడిన 11 కిలో మీటర్లు నడిచిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సునీల్ చౌహాన్, ప్రవీణ్ చౌహాన్ అనే అన్నదమ్ములు నెల్లూరు జిల్లాలో పని చేస్తున్నారు. సంఘమిత్రి ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు నుంచి యుపి వెళ్తుండగా  రాత్రి 12 గంటల సమయంలో సునీల్‌ మూత్ర విసర్జన వెళ్లాడు. అనుకోకుండా డోర్ వద్ద నుంచి అదుపుతప్పి […] The post పేగులు బయటపడిన …. 11కిలో మీటర్లు నడిచి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాజీపేట: ఓ వ్యక్తి రైలు నుంచి కింద పడడడంతో పేగులు బయటపడిన 11 కిలో మీటర్లు నడిచిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సునీల్ చౌహాన్, ప్రవీణ్ చౌహాన్ అనే అన్నదమ్ములు నెల్లూరు జిల్లాలో పని చేస్తున్నారు. సంఘమిత్రి ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు నుంచి యుపి వెళ్తుండగా  రాత్రి 12 గంటల సమయంలో సునీల్‌ మూత్ర విసర్జన వెళ్లాడు. అనుకోకుండా డోర్ వద్ద నుంచి అదుపుతప్పి కిందపడిపోయాడు. కడపులోకి రాళ్లు గుచ్చుకోవడంతో చిన్న పేగులు బయటపడ్డాయి. వెంటనే పేగులు లోపలికి నెట్టుకొని షర్ట్‌ను విప్పి గట్టిగా కట్టుకున్నాడు. అనంతరం ధైర్యం తెచ్చుకొని 11 కిలో మీటర్లు నడిచి హసన్‌పర్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. స్టేషన్ మాస్టర్ సంజయ్ కుమార్ సునీల్ ను గుర్తించి 108కి ఫోన్ చేశాడు. ప్రస్తుతం సునీల్ ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కడుపులో బలమైన గాయం కావడంతో సర్జరీ చేశామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అతని దగ్గరు ఫోన్ లేకపోవడంతో నంబర్ అతడి తమ్ముడికి సమాచారం ఇచ్చామని వైద్యులు పేర్కొన్నారు.

 

Man Injured after Fell from Train in Warangal

The post పేగులు బయటపడిన …. 11కిలో మీటర్లు నడిచి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: