పహిల్వాన్ చెరువులో పడి వ్యక్తి మృతి…

షాబాద్: పహిల్వాన్ చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ గ్రామానికి చెందిన శంకరి కిష్టయ్య (75) గత నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం షాబాద్ పహిల్వాన్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పైకి తేలడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని బయటకు తీయించారు. షాబాద్‌కు చెందిన శంకరి కిష్టయ్యగా గుర్తించారు. అతడి భార్య గత 40 […] The post పహిల్వాన్ చెరువులో పడి వ్యక్తి మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

షాబాద్: పహిల్వాన్ చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ గ్రామానికి చెందిన శంకరి కిష్టయ్య (75) గత నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం షాబాద్ పహిల్వాన్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పైకి తేలడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని బయటకు తీయించారు. షాబాద్‌కు చెందిన శంకరి కిష్టయ్యగా గుర్తించారు. అతడి భార్య గత 40 ఏళ్ల క్రితం వదిలేసింది. అప్పటి నుంచి తన అల్లుడు సీతారాంపూర్ గ్రామానికి చెందిన నర్సింహులును తన దగ్గర ఉంచుకుని చదివించాడు.

ప్రస్తుతం నర్సింహులుకు శంషాబాద్‌లో ఉద్యోగం రావడంతో 15 రోజులకోసారి షాబాద్‌కు వెళ్లి మామను చూసేవాడు. తన మామ చనిపోయిన విషయం తెలియడంతో వెంటనే షాబాద్‌కు చేరురకున్నాడు. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Man has died After Falling Into Pahilwan Pond At Shabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పహిల్వాన్ చెరువులో పడి వ్యక్తి మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: