ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం

  హైదరాబాద్ : ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.60,000, మొబైల్ ఫోన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన గుర్రం ప్రసాద్ అలియాస్ బాబు రావు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నగరంలోని బేగంపేటలో ఉంటున్నాడు. డిగ్రీ వరకు చదువుక్ను ప్రసాద్ […] The post ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.60,000, మొబైల్ ఫోన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన గుర్రం ప్రసాద్ అలియాస్ బాబు రావు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నగరంలోని బేగంపేటలో ఉంటున్నాడు. డిగ్రీ వరకు చదువుక్ను ప్రసాద్ వ్యాపారంలో వస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో తాను ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని చెప్పుతున్నాడు.

తనకు ఫై అధికారులు చాలా క్లోజ్ అని జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని పలువురికి చెప్పాడు. ఇది నమ్మిన బేగంపేటకు చెందిన సుదర్శన్ నిందితుడికి రూ.7,50,000 ఇచ్చాడు. చాలా మంది నిరుద్యోగుల నుంచి ఇలాగే డబ్బులు, వారి ఫొటోలు, బయోడాటా , అడ్రస్ ప్రూఫ్‌లు తీసుకున్నాడు. ప్రాసెస్ ఫీజు కింద వారి వద్ద డబ్బులు వసూలు చేశాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడు ప్రసాద్‌పై బేగం పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.కేసు దర్యాప్తు కోసం బేగంపేట పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్లు నాగేశ్వరరావు, ఎస్సై రవి,శ్రీకాంత్, పరమేశ్వర్, రాజశేఖర్ రెడ్డి పట్టుకున్నారు.

Man has been Arrested for fraud in name of Jobs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: