పెదనాన్న కుమార్తెకు ప్రేమ వేధింపులు!

రంగారెడ్డి: వావివరసలు మరిచిపోయి సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. ఇదే కోవలోనిది ఈ సంఘటన. సొంత పెదనాన్న కూతురును ప్రేమిస్తున్నానని తనను పెళ్లి చేసుకోమని వేధించాడో దుర్మార్గుడు. అంతటితో ఆగని అతగాడు ఇది తప్పు నీకు సోదరి అవుతుందని అడ్డుచెప్పిన పెద్దమ్మపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక వీకర్‌సెక్షన్‌ కాలనీకి చెందిన రమేష్‌(26) సొంత పెదనాన్న కుమార్తె(19)ను ప్రేమిస్తున్నానంటూ గత మూడు నెలలుగా […] The post పెదనాన్న కుమార్తెకు ప్రేమ వేధింపులు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: వావివరసలు మరిచిపోయి సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. ఇదే కోవలోనిది ఈ సంఘటన. సొంత పెదనాన్న కూతురును ప్రేమిస్తున్నానని తనను పెళ్లి చేసుకోమని వేధించాడో దుర్మార్గుడు. అంతటితో ఆగని అతగాడు ఇది తప్పు నీకు సోదరి అవుతుందని అడ్డుచెప్పిన పెద్దమ్మపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక వీకర్‌సెక్షన్‌ కాలనీకి చెందిన రమేష్‌(26) సొంత పెదనాన్న కుమార్తె(19)ను ప్రేమిస్తున్నానంటూ గత మూడు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అతన్ని కుటుంబసభ్యులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. బాధితురాలిని ఇంకా ఎక్కువగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మంగళవారం బాధిత యువతి తన తల్లితో కలిసి శంషాబాద్ గుడికి వెళ్లింది. అది గమనించిన అతగాడు వాళ్లని వెంబడించాడు. అనంతరం వాళ్లను అడ్డుకుని తనను పెళ్లి చేసుకోవాలని యువతిని బెదిరించాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో దాడి చేయబోయాడు. దాంతో యువతి తల్లి అడ్డుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న రమేష్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Man Harassed Sister in the name of Love in Shamshabad

The post పెదనాన్న కుమార్తెకు ప్రేమ వేధింపులు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: