భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

నవాబ్‌పేట : అనుమానం పెనుభూతమైంది. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం అతనికి వచ్చింది. ఈ క్రమంలో భార్య కాపురానికి రావడం లేదన్న మనస్తాపంతో ఆ వ్యక్తి వాయిస్ రికార్డ్ చేసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లోకిరేవు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. లోకిరేవు గ్రామానికి చెందిన అర్జున్‌కుమార్ (28)కు ఆరేళ్ల క్రితం అదే మండలం రేకులచౌడపూరం గ్రామానికి చెందిన […] The post భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నవాబ్‌పేట : అనుమానం పెనుభూతమైంది. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం అతనికి వచ్చింది. ఈ క్రమంలో భార్య కాపురానికి రావడం లేదన్న మనస్తాపంతో ఆ వ్యక్తి వాయిస్ రికార్డ్ చేసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లోకిరేవు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. లోకిరేవు గ్రామానికి చెందిన అర్జున్‌కుమార్ (28)కు ఆరేళ్ల క్రితం అదే మండలం రేకులచౌడపూరం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. వీరి కాపురం కొన్నేళ్లు సంతోషంగా సాగింది. వీరికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి భార్య మీద అర్జున్‌కుమార్ అనుమానం పెంచుకున్నాడు.

తన భార్యకు అదే గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానం పెనుభూతమైంది. కుటుంబాన్ని కకలావికలం చేసింది. తన భార్య మహేందర్‌తో ఫోన్‌లో నిరంతరం మాట్లాడుతుందని అనుమానించాడు. కొన్ని రోజుల క్రితం అర్జున్‌కుమార్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి కాపురానికి రావాలని భర్త అర్జున్‌కుమార్ అనేక సార్లు కోరినప్పటికీ ఆమె కాపురానికి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్జున్‌కుమార్ బుధవారం సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డ్ చేసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు తన భార్య, అత్త, ప్రియుడు మనోహర్ కారణమని వాయిస్ రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాళ్లను శిక్షించాలని వాయిస్ రికార్డ్‌లో అర్జున్‌కుమార్ పోలీసులను కోరాడు. దీంతో అర్జున్‌కుమార్ బంధువులు అతడి మృతదేహంతో ప్రియుడు ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. మహేందర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.

man commits suicide at mahabubnagar

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: