వివాహం పేరుతో మోసం…వ్యక్తి అరెస్టు

  హైదరాబాద్: వివాహం పేరుతో యువతిని వేధించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… ఖమ్మం జిల్లా, కారేపల్లికి చెందిన బానోతు సాయినాథ్(20) ఫిజియోథెరపి చదువుతున్నాడు. ప్రముఖ పాపులర్ మ్యాట్రిమనీ సైట్‌లో నుంచి యువతి ప్రొఫైల్ చూసి ఆమె ఫోన్ నంబర్ తీసుకుని కాంటాక్ట్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రాంలో నుంచి ప్రముఖు వ్యక్తి ఫొటో తీసుకుని వాటిని మ్యాట్రిమోని సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. తన పేరు అవినాష్ రెడ్డి […] The post వివాహం పేరుతో మోసం… వ్యక్తి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: వివాహం పేరుతో యువతిని వేధించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… ఖమ్మం జిల్లా, కారేపల్లికి చెందిన బానోతు సాయినాథ్(20) ఫిజియోథెరపి చదువుతున్నాడు. ప్రముఖ పాపులర్ మ్యాట్రిమనీ సైట్‌లో నుంచి యువతి ప్రొఫైల్ చూసి ఆమె ఫోన్ నంబర్ తీసుకుని కాంటాక్ట్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రాంలో నుంచి ప్రముఖు వ్యక్తి ఫొటో తీసుకుని వాటిని మ్యాట్రిమోని సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. తన పేరు అవినాష్ రెడ్డి ఆర్థోపిడిషన్‌గా కరీంనగర్‌లో పనిచేస్తున్నానని చెప్పాడు. ఇది నమ్మిన బాధితురాలు అతడితో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడింది. అతడే వాయిస్ చేంజ్ సాఫ్ట్‌వేర్ సాయంతో నిందితుడి తండ్రిగా, సోదరిగా మాట్లాడాడు.

యువతికి నమ్మకం కుదిరేవరకు ఇలాగే మాట్లాడిన సాయినాథ్ తర్వాత తన ఎటిఎం కార్డు డ్యామేజ్ అయిందని తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని తిరిగి ఇచ్చివేస్తానని చెప్పాడు. ఇది నమ్మిన యువతి సాయినాథ్ ఈ వ్యాలెట్లు, స్నేహితుల బ్యాంక్ ఖాతాలకు రూ. 2,80,000 పంపించింది. కొద్ది రోజుల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి బలవంతం చేయడంతో బ్లాక్‌మేయిల్ చేయడం ప్రారంభించాడు. యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించాడు. గతంలో మలేషియాలో పనిచేసిన యువతి ఇతడి వేధింపులను తట్టుకోలేక ఉద్యోగం మానివేసి ఇండియాకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విధంగా నిందితుడు నకిలీ పేరుతో పలువురు యువతులను మోసం చేసినట్లు తెలిసింది. గతంలో వరంగల్ జిల్లా హన్మకొండలోని హాస్టళ్లలో ఉంటూ అక్కడ పరిచయమైన స్నేహితులకు బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు పలువురిని మోసం చేస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఖరీదైన బైక్‌లు, వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. రాచకొండ సైబర్ క్రైం ఎసిపి హరినాథ్ పర్యవేక్షణలోఇన్స్‌స్పెక్టర్లు అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు.

Man arrested for molesting woman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివాహం పేరుతో మోసం… వ్యక్తి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: