ఆ గ్రామంలో అనారోగ్యానికి గురైతే అంతే సంగతులు

Medical facility

 

కాసిపేట /ఆదిలాబాద్ : ఆ గ్రామంలో ఎవరైన అనారోగ్యానికి గురయితే వారి సంగతి అంతేనని మామిడిగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో అనేక మంది మృత్యువాత పడ్డారని గ్రామస్తులు వాపోతున్నారు. తాజగా నగావత్ సకులాల్(28) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సకులాల్ ఇటివల అనారోగ్యానికి గురికాగా, శుక్రవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో బందువులు, గ్రామస్తులు అంబులెన్స్ కొరకు ప్రయత్నం చేసిప్పటికి అంబులెన్స్ వచ్చె అవకాశం లేక పోవడంతో చివరకు కుటుంబికులు దేవాపూర్ ట్రాక్‌లైన్ మీ దుగా మందమర్రికి తరలించినప్పటికి ఆయన అప్పటికే మృతి చెందినట్లు కుటింబికులు పేర్కొన్నారు.

వైద్యులు 10 నిమిషాల ముందు తీసుకొని వస్తే బ్రతికే వాడని చెప్పారని కుటింబికులు దుంఖించారు. మామిడిగూడెంకు చుట్టు ప్రక్కల వాగులు వుండగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు ఎటు వెళ్లలేని పరిస్థితులు వున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య సరోజ కూతురు, కూమారుడు వున్నాడు.

Mamidi gudem with no Medical facility

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ గ్రామంలో అనారోగ్యానికి గురైతే అంతే సంగతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.