మమతది ధ్వంస పాలన…

  అమిత్ దాడిని దేశమంతా చూసింది చెప్పినట్లే 24గంటల్లో ప్రతీకారం తీర్చుకున్నారు  ప.బెంగాల్ ఎన్నికల సభలో మోడీ విమర్శలు టకి(ప.బెంగాల్) : కోల్‌కతాలో మంగళవారంనాడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా బిజెపి, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ జరిగిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థ్ధాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ ప్రతీదాన్ని మమత ధ్వంసం చేస్తున్నారని, ఆమెది రాష్ట్రంలో వేధింపులు పాలనగా మారిపోయిందన్నారు. మంగళవారంనాడు రోడ్ షోలో ఏం జరిగిందో యావత్ […] The post మమతది ధ్వంస పాలన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమిత్ దాడిని దేశమంతా చూసింది
చెప్పినట్లే 24గంటల్లో ప్రతీకారం తీర్చుకున్నారు  ప.బెంగాల్ ఎన్నికల సభలో మోడీ విమర్శలు

టకి(ప.బెంగాల్) : కోల్‌కతాలో మంగళవారంనాడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా బిజెపి, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ జరిగిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థ్ధాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ ప్రతీదాన్ని మమత ధ్వంసం చేస్తున్నారని, ఆమెది రాష్ట్రంలో వేధింపులు పాలనగా మారిపోయిందన్నారు. మంగళవారంనాడు రోడ్ షోలో ఏం జరిగిందో యావత్ భారతదేశం చూసిందని, టిఎంసి గూండాలు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఎలా దాడికి ప్రయత్నించారో అందరూ టీవీల్లో వీక్షించారని మోడీ బుధవారంనాడిక్కడ జరిగిన ఎన్నికల సభలో ధ్వజమెత్తారు.

దీదీ గూండాలు బాంబులు, తుపాకులు, రాడ్‌లు చేతపట్టుకుని నానా హంగామా సృష్టించారని మండిపడ్డారు. మమత ఎంత రెచ్చగొడితే బిజెపి కమలం ఇక్కడ అంత వికసిస్తుందన్నారు. బిజెపిపై ప్రతీకారం తీర్చుకుంటానని దీదీ చెప్పిన 24 గంటల్లోనే బిజెపి చీఫ్ అమిత్ షా రోడ్‌షోపై దాడి జరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారులు సైతం మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ మార్ఫింగ్ ఇమేజ్‌ను షేర్ చేసిన బిజెపి కార్యకర్త అరెస్ట్‌ను ప్రధాని ప్రస్తావిస్తూ మీరు జైలులో పెడుతున్న కుమార్తెలు రేపు మిమ్మలి శిక్షిస్తారని అన్నారు. ఒక ఫోటోపై ఇంత ఆగ్రహం వెలిబుచ్చుతారా అని ప్రశ్నించారు. అమర్యాదకరంగా తన ఫోటోను చిత్రీకరించి తీసుకువచ్చినా తానేమీ ఆగ్రహించనని, హుందాగా అంగీకరిస్తానని ప్రధాని చెప్పుకొచ్చారు. తన ఫోటోను అలా మార్చి తీసుకువస్తే మీపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాదని కూడా తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌ను సమూలంగా తిరస్కరిస్తారని మోడీ జోస్యం చెప్పారు. బిజెపి పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. తమ పార్టీకి 300కి పైగా సీట్లు రావడంలో బెంగాల్ తోడ్పాటు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఓటమిని ఒప్పుకునేందుకు ఇద్దరు బ్యాట్స్‌మెన్లు…
డియోఘర్: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ నాయకులమీద బుధవారం మరోసారి విరుచుకుపడ్డారు. రాజవంశాన్ని సమర్థించేందుకు ఆ పార్టీ మణిశంకర్ అయ్యర్, సామ్ పిట్రోడా అనే ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ని నిలబెట్టిందని పరిహసించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింటానని కాంగ్రెస్‌కు తెలుసు. అందుకే ఓటమికి బాధ్యత వహించేందుకు పాపాల భైరవుల్లా వారిని నిలబెట్టింది.1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి ఓ వ్యకి ‘జరిగిందేదో జరిగిపోయింది’ అన్నారు.

 

Mamata’s rule of destruction

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మమతది ధ్వంస పాలన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: