మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత చింతల కనకారెడ్డి(68) శనివారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. 2014- 18 మధ్య మల్కాజ్‌గిరి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కనకారెడ్డి పనిచేశారు.  కనకారెడ్డి ద్రాక్ష రైతుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజా రాజ్యం పార్టీ తరఫున 2009 మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొంతకాలం టిడిపిలో పని […] The post మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత చింతల కనకారెడ్డి(68) శనివారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. 2014- 18 మధ్య మల్కాజ్‌గిరి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కనకారెడ్డి పనిచేశారు.  కనకారెడ్డి ద్రాక్ష రైతుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజా రాజ్యం పార్టీ తరఫున 2009 మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొంతకాలం టిడిపిలో పని చేశారు. ఆ తర్వాత 2014లో టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. అనారోగ్యం కారణంగా ఆయన గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కనకారెడ్డి మృతిపై సిఎం కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. కనకారెడ్డి మృతిపై  టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి , ఈటల రాజేందర్, పలువురు టిఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు.

Malkajgiri Ex MLA Kanaka Reddy Passes Away

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: