నేనింతే అంటున్న మాళవికా

ఈ మధ్య హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇదంతా జరుగుతోంది. హీరోయిన్ల డ్రెస్సులు నచ్చకపోతే సింపుల్‌గా నెటిజన్లు తిరస్కరిస్తున్నారు. తమకు తోచిన శైలిలో కామెంట్స్‌తో విసిగిస్తున్నారు. అయితే అందాల భామలు ఏమాత్రం తగ్గడం లేదు. కొందరైతే వారి నెగిటివ్ కామెంట్స్‌ని సైతం తెగ ఎంజాయ్ చేస్తుంటే… ఇంకొందరు అప్పటికప్పుడే ఘాటైన సమాధానాలతో చర్చల్లో నిలుస్తున్నారు. తాజాగా ’పేట’ భామ మాళవికా మోహనన్ కూడా ఈ ట్రోలింగ్స్‌ని ఎదుర్కొంటోంది. మొన్నామధ్య […] The post నేనింతే అంటున్న మాళవికా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ మధ్య హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇదంతా జరుగుతోంది. హీరోయిన్ల డ్రెస్సులు నచ్చకపోతే సింపుల్‌గా నెటిజన్లు తిరస్కరిస్తున్నారు. తమకు తోచిన శైలిలో కామెంట్స్‌తో విసిగిస్తున్నారు. అయితే అందాల భామలు ఏమాత్రం తగ్గడం లేదు. కొందరైతే వారి నెగిటివ్ కామెంట్స్‌ని సైతం తెగ ఎంజాయ్ చేస్తుంటే… ఇంకొందరు అప్పటికప్పుడే ఘాటైన సమాధానాలతో చర్చల్లో నిలుస్తున్నారు. తాజాగా ’పేట’ భామ మాళవికా మోహనన్ కూడా ఈ ట్రోలింగ్స్‌ని ఎదుర్కొంటోంది. మొన్నామధ్య ఓ హాట్ పోజులో ఫోటో పోస్ట్ చేస్తే ఆ ఫోటోకి వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కి తాజాగా ధీటైన సమాధానమిచ్చింది. అంతకుమించిన హాట్ ఫోటోని పోస్ట్ చేసి ‘నేనింతే.. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటాను. అయినా నేనెలాంటి దుస్తులు వేసుకోవాలో మీరెలా చెబుతారు’ అంటూ మండిపడింది. ఈ భామ ప్రస్తుతం విజయ్‌దేవరకొండతో ‘హీరో’ సినిమాలో నటిస్తోంది.

Malavika Mohanan lashed out at her detractors in style

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేనింతే అంటున్న మాళవికా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: