మేకప్ కిటుకులు

ఉద్యోగినులు ఎంతో కొంత అలంకరణకు ప్రాధాన్యం ఇస్తోన్న రోజులివి. మరి వేసుకునే కాస్త మేకప్ అయినా రోజంతా నిలిచి ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. * సాధారణంగా మేకప్ వేసుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలంటారు. అయితే అతిగా మాత్రం కాదు. దానివల్ల ఫౌండేషన్ త్వరగా పోయే అవకాశం ఎక్కువ. అలాగని చర్మాన్ని తేమగా ఉంచకపోవడం కూడా పొరపాటు. కాబట్టి చాలా కొద్దిగా వాడాలి. * ఉద్యోగినులు కాబట్టి లిక్విడ్ ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి. అలాగే సెట్టింగ్ స్ప్రే కూడా […] The post మేకప్ కిటుకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉద్యోగినులు ఎంతో కొంత అలంకరణకు ప్రాధాన్యం ఇస్తోన్న రోజులివి. మరి వేసుకునే కాస్త మేకప్ అయినా రోజంతా నిలిచి ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* సాధారణంగా మేకప్ వేసుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలంటారు. అయితే అతిగా మాత్రం కాదు. దానివల్ల ఫౌండేషన్ త్వరగా పోయే అవకాశం ఎక్కువ. అలాగని చర్మాన్ని తేమగా ఉంచకపోవడం కూడా పొరపాటు. కాబట్టి చాలా కొద్దిగా వాడాలి.
* ఉద్యోగినులు కాబట్టి లిక్విడ్ ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి. అలాగే సెట్టింగ్ స్ప్రే కూడా ముఖ్యమే. అలంకరణ అంతా అయ్యాక దీన్ని కొద్దిగా వాడితే మేకప్ చెదరకుండా ఉంటుంది.
* ప్రైమర్ కూడా ముఖ్యమే. అయితే ఇది కేవలం ముఖానికే కాదు.. కనురెప్పలపైనా, పెదవులపైనా కూడా రాసుకోవాలి. దీనివల్ల చర్మం తేమగా ఉంటుంది.
* ఉద్యోగినులు మెరిసే అలంకరణ సామగ్రికి దూరంగా ఉండాలి. అవి ముఖాన్ని అం దంగా, మెరిసేలా కనిపించేలా చేస్తాయి కానీ… రోజంతా ఆ తాజాదనం ఉండదు. పార్టీలకు అయితేనే బాగుంటుంది. లేదంటే మ్యాటీ రకాలను ఎంచుకోవాలి. అలాగే కళ్ల విషయానికి వస్తే వాటర్‌ప్రూఫ్ మస్కారా, ఐలైనర్‌ని ఎంచుకోవాలి.
* పెదవులకు లిప్‌స్టిక్ రాసుకునేముందు అవుట్‌లైన్ గీసుకోవాలి. ఆ తరువాత కొద్దిగా లూజ్ పౌడర్ అద్దుకుని అప్పుడు లిప్‌స్టిక్ రాసుకోవాలి. ఆ తరువాత కూడా కొద్దిగా పౌడర్ అద్దుకుంటే… చాలు.
* కనుబొమల్ని కూడా వదిలేయాలని లేదు. దీనికి పెన్సిల్ వాడటం కన్నా జెల్‌లైనర్లు ఎంచుకోవాలి. ఇలా చేస్తే కనుబొమలు తీర్చిదిద్దినట్లుగా తీరైన ఆకృతిలో కనిపిస్తాయి.

makeup tips in Telugu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మేకప్ కిటుకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.