ఆ సమయంలో ప్రేమలో పడతారట

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్ నుంచి తిరిగి రాగానే మహేష్ తన నెక్స్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌లో పాల్గొంటారు. ‘ఎఫ్ 2’ ఘనవిజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. ఇదిలాఉండగా ఈ సినిమా గురించి తాజాగా […] The post ఆ సమయంలో ప్రేమలో పడతారట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్ నుంచి తిరిగి రాగానే మహేష్ తన నెక్స్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌లో పాల్గొంటారు. ‘ఎఫ్ 2’ ఘనవిజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. ఇదిలాఉండగా ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో మహేష్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే కదా. మహేష్ ఒకసారి కాశ్మీర్ నుంచి ఆంధ్రాకు తిరుగు ప్రయాణం చేసే సమయంలో హీరోయిన్ రష్మిక మందన్నతో ప్రేమలో పడతారట. ఇదంతా ట్రైన్ జర్నీ నేపథ్యంలో బ్యూటిఫుల్‌గా సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ట్రైన్ జర్నీ నేపథ్యంలో లవ్ ట్రాక్ ఉండే సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ తీసుకొచ్చేలా అనిల్ రావిపూడి ఈ లవ్ ట్రాక్‌ను కొత్తగా డిజైన్ చేశారట. మహేష్ ఈమధ్య చేసినవన్నీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే. కానీ ఈసారి మాత్రం ‘దూకుడు’ తరహాలో ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఆయన నటించబోతున్నారు. అనిల్ రావిపూడి కమర్షియల్ ఎంటర్‌టైనర్లను మలచడంలో స్పెషలిస్ట్ కాబట్టి ఈసారి మహేష్ నుంచి మనం పూర్తి వినోదాన్ని ఆశించవచ్చు.

Mahesh babu play as Army major role in Anil Ravipudi movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ సమయంలో ప్రేమలో పడతారట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: