సెలబ్రేటింగ్ మహర్షి

  ఫ్యామిలీతో పాటు వరల్డ్ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆదివారం ఓవల్‌లో జరిగిన టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌ను మహేష్‌తో కలిసి వీక్షించడానికి మరో సెలెబ్రిటీ కూడా హాజరయ్యారు. ఆయనెవరో కాదు మహేష్‌కు ‘మహర్షి’ వంటి హిట్ మూవీ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మహేష్‌బాబు, నమ్రత దంపతులు, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను వంశీపైడిపల్లి […] The post సెలబ్రేటింగ్ మహర్షి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఫ్యామిలీతో పాటు వరల్డ్ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆదివారం ఓవల్‌లో జరిగిన టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌ను మహేష్‌తో కలిసి వీక్షించడానికి మరో సెలెబ్రిటీ కూడా హాజరయ్యారు. ఆయనెవరో కాదు మహేష్‌కు ‘మహర్షి’ వంటి హిట్ మూవీ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మహేష్‌బాబు, నమ్రత దంపతులు, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను వంశీపైడిపల్లి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా..’ అంటూ ‘సెలబ్రేటింగ్ మహర్షి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఇక బ్లూ కలర్ టీ షర్ట్‌లో గాగుల్స్ పెట్టుకొని ఉన్న మహేష్ లుక్ సూపర్‌గా ఉంది. గతంలో పలుసార్లు తనకు క్రికెట్ అంటే ఇష్టమని చెప్పిన మహేష్… టీమిండియా విజయం సాధించినప్పుడు సోషల్ మీడియా ద్వారా జట్టుకు శుభాకాంక్షలు కూడా చెప్పారు.

Mahesh babu with family in oval stadium

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సెలబ్రేటింగ్ మహర్షి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: