మేజర్ అజయ్ కృష్ణగా మహేష్‌బాబు

  సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఎఫ్ 2’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ కాశ్మీర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా అంటూ అనిల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఈ […] The post మేజర్ అజయ్ కృష్ణగా మహేష్‌బాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఎఫ్ 2’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ కాశ్మీర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా అంటూ అనిల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కాశ్మీర్ షెడ్యూల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో వేసిన రైలు సెట్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. కాశ్మీర్ నుంచి ఆంధ్ర వెళ్లే రైల్లో ఆర్మీ అధికారి మహేష్, ఇతర ప్రధాన తారాగణానికి మధ్య సాగే ఆసక్తికరమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ఇక ఈ చిత్రంలో మహేష్, విజయశాంతి మధ్య సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని తెలిసింది. ఇప్పటికే విజయశాంతి ఇంటి సెట్‌ను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మహేష్ మిలటరీ గెటప్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్ర పేరు కూడా తెలిసిపోయింది. మహేష్ పాత్ర పేరు మేజర్ అజయ్ కృష్ణ. ఆర్మీ అధికారి ప్యాకెట్‌పై ఉండే బ్యాడ్జిపై అజయ్ కృష్ణ అన్న పేరు ఉంది. ఇక ఈ పేరును ఎంపిక చేసుకోవడానికి ఓ ఆసక్తికర కారణం తెలిసింది. ‘దూకుడు’లో అజయ్, ‘పోకిరి’లో కృష్ణ మనోహర్ .. రెండూ కలిపి అజయ్ కృష్ణ అని పేరు పెట్టారు. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ నటనలో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం? అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతూనే ఓ చక్కని సందేశాన్ని ఇస్తున్నారని తెలిసింది.

Mahesh Babu plays an army officer in Sarileru Neekevvaru

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మేజర్ అజయ్ కృష్ణగా మహేష్‌బాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: