మండలి బరిలో ఇద్దరే

టిఆర్‌ఎస్ తరఫున మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున ప్రతాప్‌రెడ్డి చెల్లని డిసిసి అధ్యక్షుడు నర్సింహరెడ్డి, శ్రమజీవి పార్టీ అభ్యర్ధ్ది భాస్కర్ నామినేషన్లు నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ నేత ఉదయ్‌మోహన్ రెడ్డి మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో కీలకఘట్టం ముగిసింది. మండలిబరిలో ఎవరు ఉంటారన్న దానిపై స్పష్టత వచ్చింది. ఈ నెల 14 న నామినేషన్‌ల పర్వం చివరిరోజు టిఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ప్రతిపక్ష […] The post మండలి బరిలో ఇద్దరే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టిఆర్‌ఎస్ తరఫున మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున ప్రతాప్‌రెడ్డి
చెల్లని డిసిసి అధ్యక్షుడు నర్సింహరెడ్డి, శ్రమజీవి పార్టీ అభ్యర్ధ్ది భాస్కర్ నామినేషన్లు
నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ నేత ఉదయ్‌మోహన్ రెడ్డి

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో కీలకఘట్టం ముగిసింది. మండలిబరిలో ఎవరు ఉంటారన్న దానిపై స్పష్టత వచ్చింది. ఈ నెల 14 న నామినేషన్‌ల పర్వం చివరిరోజు టిఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్ మొదట తమ అభ్యర్ధిగా కె. ఉదయ్‌మోహన్ రెడ్డిని ప్రకటించి అంతలోనే సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి బిఫామ్ అందచేసింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య ఉదయ్‌మోహన్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సిం హరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో గురువారం డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డితో పాటు శ్రమజీవి పార్టీ అభ్యర్థి భాస్కర్ నామినేషన్ సైతం చెల్లకుండాపోయాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకుచివరిరోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి మద్దతుగా నామినేషన్ వేసిన మరో అభ్యర్థి ఉదయ్‌మోహన్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు నర్సింహరెడ్డితో కలసి జాయింట్ కలెక్టర్ హరీష్‌ను కలిసిన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్దులతో కూడిన ఫామ్ 7 బిని అధికారులు ప్రకటించారు.
బరిలో మహేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి
స్థానిక సంస్థల మండలి ఎన్నికల బరిలో టిఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలు మిగిలారు. ఇద్దరు నేతలు ఆర్ధీక, అంగ బలాలు పుష్కలంగా ఉండటంతో నువ్వా నేనా అన్న స్థాయిలో సమరానికి సిద్దమవుతున్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే తమ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేసుకుని క్యాంపు రాజకీయాలకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తమకు ఓటు వేస్తే ఎమి చేస్తాము…ఎమి ఇస్తాము అన్న దానిపై తమ ఓటర్లతో ఇప్పటికే దాదాపుగా ఒక అవగాహనకు వచ్చిన నేతలు నేడో రేపో వారిని క్యాంపులకు తరలించడానికి సిద్దంగా ఉన్నారు. పదవి కాలం పోయే ముందు ఓట్ల పండగ రావడంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మాత్రం గాలీలో తెలుతు తమ డిమాండ్‌ల చిట్టాలను అభ్యర్దులకు, వారి ప్రధాన అనుచరులకు పంపిస్తున్నారు. ఒక్కోక్కరి డిమాండ్‌లు చూస్తున్న అభ్యర్దులకు మాత్రం మండు ఎండలలో చుక్కలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. రెండు పార్టీలు ఈ రోజు నుంచి తమ అభ్యర్దులకు క్యాంపులకు తరలించడానికి సిద్దమవుతుండగా కావలసిన నజరానాలు ఇక్కడే ఇస్తేనే క్యాంపులకు వస్తామంటు కొంత మంది ఓటర్లు మెలిక పెడుతున్నారని అందువలన క్యాంపులు కొంత ఆలస్యం అవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోరు ముఖాముఖీ కావడంతో ఓటర్లు సైతం అందివచ్చిన అవకాశం వదులుకోకుండా అందిన కాడికి దండుకుందామన్న కసితో కనిపిస్తున్నారు.

Mahender Reddy And Prathap Reddy Contest In MPTC Elections

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మండలి బరిలో ఇద్దరే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: