మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు…

  పెద్దపల్లి: మహాత్మా జ్యోతిబాపూలే అడుగు జాడల్లో అందరూ నడవాలని, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే 193వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో గురువారం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే అని, బడుగుల స్ఫూర్తి కోసం పూలే పడిన ఆరాటం అనిర్వచనీయమని కొనియాడారు. మహాత్మాజ్యోతిబాపూలే సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉండాలని, స్త్రీలు […] The post మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పెద్దపల్లి: మహాత్మా జ్యోతిబాపూలే అడుగు జాడల్లో అందరూ నడవాలని, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే 193వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో గురువారం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే అని, బడుగుల స్ఫూర్తి కోసం పూలే పడిన ఆరాటం అనిర్వచనీయమని కొనియాడారు. మహాత్మాజ్యోతిబాపూలే సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉండాలని, స్త్రీలు సంఘంలో పురుషులతో సమాన భాగంగా ఉండాలని పోరాటం చేసి దేశాన్ని మేల్కొల్పి, సంఘ సంస్కరణల్లో గాంధీ, అంబేద్కర్‌లకు ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి పూలే అని కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ వనజాదేవి, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి, జిఎం పరిశ్రమలు ప్రేంకుమార్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Mahatma JyotibaPhule Birthday Celebrations

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: