మహేష్ కెరీర్‌లో ‘మహర్షి’ బిగ్గెస్ట్ హిట్

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్‌బాబు మాట్లాడుతూ “నా 25 సినిమాల ప్రయాణం ఎంతో ప్రత్యేకం. అందులో ఈ సినిమా మరింత ప్రత్యేకం. ఈ సినిమా చూసిన […] The post మహేష్ కెరీర్‌లో ‘మహర్షి’ బిగ్గెస్ట్ హిట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్‌బాబు మాట్లాడుతూ “నా 25 సినిమాల ప్రయాణం ఎంతో ప్రత్యేకం. అందులో ఈ సినిమా మరింత ప్రత్యేకం. ఈ సినిమా చూసిన తర్వాత నా అభిమానులు, నాన్నగారి అభిమానులు కాలర్ ఎత్తుకొని తిరుగుతారని దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు నేను కాలర్ ఎత్తుకుంటున్నాను. నాకు దేవిశ్రీ అంటే ప్రాణం. పదరా పదరా.., ఇదే కదా ఇదే కదా… వంటి మంచి పాటలు కథలో భాగంగా వెళ్తుంటాయి. నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ తనలా కంపోజ్ చేయలేరేమో. ఈ సినిమా నా కెరీర్‌లో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచిపోయింది”అని అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ “మహర్షి చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించిందంటే దానికి కారణం మహేష్. ఒక మంచి సినిమా తీస్తే ఎలా ఆదరిస్తారనే దాన్ని నిరూపించిన తెలుగు ప్రేక్షకులు, సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నాను”అని చెప్పారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ “సాధారణంగా నేను కామెడీ చేస్తాను. అలాంటిది ఓ సీరియస్ క్యారెక్టర్ కూడా చేస్తానని నమ్మి సినిమాలో అవకాశం ఇచ్చిన మహేష్, వంశీలకు థాంక్స్. మహేష్‌తో పనిచేయడం గొప్ప అనుభవం”అని పేర్కొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “ఈ సినిమా కథ విన్న రోజు నుండి బాగా నమ్మాను. నా నమ్మకం ఈ రోజు నిజమైనందుకు గర్వంగా ఉంది. మహేష్ 25వ సినిమాలో రైతుల గురించి ప్రస్తావించడం ఆనందంగా ఉంది. మహేష్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.అశ్వనీదత్, పోసాని కృష్ణమురళి, కమల్ కామరాజు, హరి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

Maharshi movie Success meet

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహేష్ కెరీర్‌లో ‘మహర్షి’ బిగ్గెస్ట్ హిట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: