మే1 లేదా 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవల షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసిన సినిమా యూనిట్ సభ్యులు ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ వార్త తెలిసింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మే 1 లేదా 4న నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మహేష్ 25వ చిత్రం కావడంతో ఈ వేడుకకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. భారీ స్థాయిలో అభిమానుల సమక్షంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో నిర్మాత దిల్‌రాజు ఉన్నారట. అందుకు తగ్గట్టు ఫంక్షన్ డేట్, వేదికను ఎంపిక చేసే పనిలో ఉన్నారట ఫిల్మ్‌మేకర్స్. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందనే నమ్మకంతో మహేష్ అభిమానులు ఉన్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.

 

Maharshi Cinema Released on May First or Fourth

The post మే1 లేదా 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.