కమలం కదం!

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎన్‌డిటివి ఎగ్జిట్ పోల్ అంచనాలో వెల్లడైంది. సోమవారం ఈ రాష్ట్రాలలో పోలింగ్ ఘట్టం ముగిసిన తరువాత ఎన్‌డిటీవి అన్ని ఎగ్జిట్ పోల్స్‌పై తమ సర్వే ఫలితాలను వెలువరించింది. ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉం ది. మహారాష్ట్రలో బిజెపి శివపేన కూటమి సునాయాస విజయం సాధిస్తుందని, హర్యానాలో నూ ఇదే పరిస్థితి ఉందని ఎగ్జిట్‌పోల్‌లో స్పష్టం అయింది. మహారాష్ట్రకు సంబంధించి వివిధ ఎగ్జిట్ […] The post కమలం కదం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎన్‌డిటివి ఎగ్జిట్ పోల్ అంచనాలో వెల్లడైంది. సోమవారం ఈ రాష్ట్రాలలో పోలింగ్ ఘట్టం ముగిసిన తరువాత ఎన్‌డిటీవి అన్ని ఎగ్జిట్ పోల్స్‌పై తమ సర్వే ఫలితాలను వెలువరించింది. ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉం ది. మహారాష్ట్రలో బిజెపి శివపేన కూటమి సునాయాస విజయం సాధిస్తుందని, హర్యానాలో నూ ఇదే పరిస్థితి ఉందని ఎగ్జిట్‌పోల్‌లో స్పష్టం అయింది. మహారాష్ట్రకు సంబంధించి వివిధ ఎగ్జిట్ పోల్స్ సగటు లేదా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణతో రాష్ట్ర ంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలలో ఈ కాషాయ కూటమికి 211 స్థానాలు వస్తాయని అంచనావేశారు. ఇది భారీ మెజార్టీగా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కూటమి 64 స్థానాలను గె ల్చుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మెజార్టీ సాధనకు అవసరమైన స్థానాలు 145. ఇక హర్యానాలో బిజెపి మొత్తం 90 స్థానాలలో 66 స్థానాలను గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్‌లో తేల్చారు.

కాంగ్రెస్‌కు కేవలం 14 స్థానాలు వస్తాయని తెలిపారు. మెజార్టీ సంఖ్యాబలం ఇక్కడ 46 స్థానాలు. ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న భారీ స్థాయి ఎన్నికలు కావడంతో వీటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో పలు కీలక పరిణామాలు జరిగాయి. వీటి పట్ల జనం నాడి ఏ విధంగా ఉంటుందనేది 24వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల దశలో సుస్పష్టం అవుతుంది. రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకే తిరిగి అధికారం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడికావడంతో ఆర్టికల్ 370 రద్దును ప్రధాన ప్రచార అస్త్రం చేసుకున్న ప్రధాని మోడీకి విజయం దక్కినట్లుగా భావిస్తున్నారు. రెండు రాష్ట్రాలలోనూ మోడీ తమ సుడిగాలి పర్యటనలలో ప్రధానంగా కశ్మీర్ విషయంలో తీసుకున్న చర్యను ప్రస్తావించారు. అన్ని స్థాయిల్లో కాంగ్రెస్‌పై ఈ అంశంపైనే ఇరకాటంలోకి నెట్టారు. తమ విజయపరంపర ప్రధాని మోడీ నిర్ణయాలకు ఆమోదముద్రగా బిజెపి తెలియచేసుకొంటోంది.

ప్రతిపక్షాలు దేశంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రజల దృష్టిని కేంద్రీకృతం చేయించేందుకు యత్నించాయి. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రచారకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలలో ఎక్కువగా ఆర్థిక రంగంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం చెందిందని విమర్శించారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవని, ప్రచార ఆర్బాటం, ప్రశ్నించే వారి గొంతుక నొక్కడమే ఈ ప్రభుత్వం చేసిన పని అని నినదించారు. మహారాష్ట్ర ఎన్నికల సభలలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యల గురించి, కుంటుపడుతున్న పారిశ్రామిక ప్రగతి గురించి చెప్పారు. వ్యవసాయ సంక్షోభం, రైతాంగ నిరాశా నిస్పృహలను ప్రస్తావించారు. జాబ్‌లడిగితే జాబిల్లిని చూపుతున్నారని మండిపడ్డారు. హర్యానా దేశంలోనే మూడో అత్యధిక నిరుద్యోగ స్థాయి ఉందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు 2019 ….ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్‌డిటీవి సమగ్ర పోల్, రాష్ట్రం ః మహారాష్ట్ర మొత్తం స్థానాలు 288… బిజెపి ప్లస్ శివసేన 211…కాంగ్రెస్ ప్లస్ ఎన్‌సిపి 64, హర్యానా ః మొత్తం స్థానాలు 90, బి.ఓని 66….కాంగ్రెస్ 14 ( ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన పోటీలోనే ఉన్న ఎన్‌ఎల్‌డి గురి ంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో వెల్లడించలేదు.
జాతీయ అంశాలే మహా ప్రాధాన్యతలా?
మహారాష్ట్రలో కీలకంగా ఈసారి జాతీయ స్థాయి అంశాలే ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు సర్వేలలో వెల్లడైంది. శరద్ పవార్ వంటి ప్రతిపక్ష నేతలు అధికార పక్షం పనితీరు గురించి ఇప్పటి సిఎం ఫడ్నవిస్ వైఫ ల్యం గురించి ప్రస్తావించేందుకు యత్నించా రు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు ప్రధానం గా పరిగణనలోకి వస్తాయని, వీటిపైనే ఓటర్లు ఆలోచించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఇం తకు ముందటి కన్నా ఇప్పుడు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఇవే ప్రధా న స్థానిక అంశాలని తెలిపారు.
మిశ్రమ స్పందన ఉన్నా ఖట్టరే విన్నర్ ?
హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ పాలనా తీరుపై మిశ్రమ స్పందన వెలువడుతూ వచ్చింది. అయితే దీనికి సంబంధం లేకుండా తిరిగి ఆయననే ప్రజలు అధికార పీఠం వైపు తీసుకువెళ్లుతున్నట్లు ఎగ్జిట్ పోల్‌తో వెల్లడైంది. జాతీయ అంశాలపై జరిగిన ప్రచారమే ఇందుకు కారణమని విశ్లేషించారు. ఇక కాంగ్రెస్ రెండు చోట్లా కూడా భారీ స్థాయి పోటీ ఇవ్వలేదనే విషయం ప్రచార ఘట్టంలోనే తేలిపోయింది. దీనితో అధికార పక్షం దూసుకువెళ్లింది. పైగా అలుపులేని ప్రచారంతో బిజెపి నేతలు తిరగడం మరింత బలానికి దారితీసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత పరాజయ ప్రభావం నుంచి రాహుల్ ఇప్పటికీ తేరుకోలేదు. ఆయన రాజీనామా తరువాత పార్టీలో ఏర్పడిన శూన్యత వంటి పరిణామాలు కీలకంగా మారాయి.

Maharashtra and Haryana Assembly Elections Highlights

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కమలం కదం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: