లాహోర్‌లో మహారాజా రంజిత్‌సింగ్ విగ్రహం ధ్వంసం

Mahraja-Singh

లాహోర్ (పాకిస్థాన్): 19 వ శతాబ్దం ప్రారంభంలో పంజాబ్‌ను దాదాపు 40 ఏళ్ల పాటు పరిపాలించిన మహారాజా రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ఇక్కడ శనివారం ఇద్దరు ధ్వంసం చేశారు. సిక్కు సామ్రాజ్యానికి మొదటి మహారాజైన రంజిత్ సింగ్ 1839 లో చనిపోయారు. తొమ్మిది అడుగుల ఎత్తయిన ఈ కంచు విగ్రహాన్ని రంజిత్ సింగ్ 180 వ జయంతి సందర్భంగా లాహార్ కోటలో ఆవిష్కరించారు. నిందితులిద్దరిని దైవ దూషణ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితులు మతోన్మాద మౌలానా రిజ్వికి చెందిన తెహ్రీక్‌లబ్బాయిక్ సంస్థ తాలూకు మతోన్మాదులు. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా ఈ దాడికి పూనుకున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్ కేంద్రమైన సిక్కు హెరిటేజి ఫౌండేషన్ సహకారంతో వాల్‌సిటీ ఆఫ్ లాహోర్ అథారిటీ ఈ విగ్రహాన్ని నెలకొల్పింది. వచ్చే వారం నుంచి విగ్రహం మరమ్మతులు చేయిస్తామని, ఇటువంటి ఆగడాలు జరగకుండా లాహార్ కోటలో భద్రత కట్టు దిట్టం చేస్తామని అధారిటీ అధికార ప్రతినిధి తానియా ఖురేషి చెప్పారు.

Maharaja Ranjit singh statue destroyed in lahore

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లాహోర్‌లో మహారాజా రంజిత్‌సింగ్ విగ్రహం ధ్వంసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.