తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: కెసిఆర్

CM-KCR

 

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాల్లో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శివుడిని ప్రార్థించామన్నారు. మేడ్చల్ జిల్లా కీసర శ్రీరామలింగేశ్వర స్వామిని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. కీసర దేవాలయాన్ని దర్శించుకున్న వారిలో మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్‌సిలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, ఎంఎల్‌ఎ కెపి వివేకానంద, జెడ్‌పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు ఉన్నారు.

 

Maha Shivaratri wishes to telangana People says KCR

The post తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.