ఒసాకా ఇంటికి

హలెప్, జకోవిచ్ ముందంజ, మాడ్రిడ్ ఓపెన్ మాడ్రిడ్: ప్రతిష్టాత్మకమైన మాడ్రిడ్ ఓపెన్‌లో టాప్ సీడ్ నజోమి ఒసాకా (జపాన్)కు చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఒసాకా ఓటమి పాలైంది. మరోవైపు మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) సెమీఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. తొమ్మిదో సీడ్ మారిన్ సిలిక్ (క్రొయేషియా), ఏడో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా)లు కూడా ముందంజ […] The post ఒసాకా ఇంటికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హలెప్, జకోవిచ్ ముందంజ, మాడ్రిడ్ ఓపెన్
మాడ్రిడ్: ప్రతిష్టాత్మకమైన మాడ్రిడ్ ఓపెన్‌లో టాప్ సీడ్ నజోమి ఒసాకా (జపాన్)కు చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఒసాకా ఓటమి పాలైంది. మరోవైపు మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) సెమీఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. తొమ్మిదో సీడ్ మారిన్ సిలిక్ (క్రొయేషియా), ఏడో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా)లు కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ పెట్రా క్విటోవా (చెక్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో క్విటోవా 63, 63తో కరొలినా గార్సియా (ఫ్రాన్స్)ను చిత్తు చేసింది.

ఇక, టాప్ సీడ్ ఒసాకాకు క్వార్టర్ ఫైనల్లోనే షాక్ తగిలింది. బెలిండా బెనిసిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఒసాకా కంగుతింది. మూడు సెట్ల హోరాహోరీ సమరంలో బెలిండా 36, 62, 75తో ఒసాకాకు ఓడించింది. తొలి సెట్‌లో ఒసాకా ఆధిపత్యం చెలాయించింది. తన మార్క్ ఆటతో చెలరేగిన ఒసాకా అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే కీలకమైన రెండో సెట్‌లో బెలిండా పుంజుకుంది. అద్భుత ఆటతో ఒసాకాను కంగుతినిపించింది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న బెలిండా మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీస్‌కు చేరుకుంది. మరో పోటీలో మూడో సీడ్ హలెప్ 75, 75తో ఆస్ట్రేలియా క్రీడాకారిణి, తొమ్మిదో సీడ్ ఆశ్లే బార్టిను ఓడించింది. ఈ మ్యాచ్ కూడా ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఇరువురు ప్రతిపాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో రెండు సెట్లు కూడా టైబ్రేకర్ వరకు వెళ్లాయి. ఇందులో ఆఖరి వరకు దూకుడును ప్రదర్శించిన హలెప్ విజయం సాధించింది. సెమీస్‌లో హలెప్ స్విస్ క్రీడాకారిణి బెలిండాను ఢీకొంటుంది. ఇక, పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ 61, 76తో ఫ్రాన్స్ ఆటగాడు జెర్సి చార్డిను ఓడించాడు. ఇతర పోటీల్లో మారిన్ సిలిక్, డొమినిక్ థిమ్‌లు విజయం సాధించారు.

Madrid Open: Djokovic enter into Quarter final

The post ఒసాకా ఇంటికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: