ఫైనల్లో జకోవిచ్

నాదల్ ముందుకు, జ్వరేవ్ ఔట్, మాడ్రిడ్ ఓపెన్ మాడ్రిడ్: టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు మూడో అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఇక, పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సెర్బియా యోధుడు జకోవిచ్ 76, 76 తేడాతో ఆస్ట్రియా సంచలనం, ఐదో సీడ్ డొమినిక్ థిమ్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే పోరు […] The post ఫైనల్లో జకోవిచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నాదల్ ముందుకు, జ్వరేవ్ ఔట్, మాడ్రిడ్ ఓపెన్
మాడ్రిడ్: టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు మూడో అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఇక, పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సెర్బియా యోధుడు జకోవిచ్ 76, 76 తేడాతో ఆస్ట్రియా సంచలనం, ఐదో సీడ్ డొమినిక్ థిమ్‌ను ఓడించాడు.

ప్రారంభం నుంచే పోరు ఉతంఠభరితంగా సాగింది. ఇద్దరు ప్రతిపాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు పోరాడారు. థిమ్ అద్భుత పోరాట పటిమతో జకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జకోవిచ్ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్ పోరుకు చేరుకున్నాడు. మరోవైపు స్పెయిన్ బుల్ నాదల్ సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో నాదల్ 61, 62తో స్విట్జర్లాండ్ ఆటగాడు వావ్రింకాను ఓడించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో నాదల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మరోవైపు మూడో సీడ్ జ్వరేవ్ క్వార్టర్స్‌లోనే ఓటమి పాలయ్యాడు. గ్రీస్ ఆటగాడు స్టెఫానొస్ చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) ఫైనల్‌కు చేరుకుంది.

Madrid Open 2019: Djokovic enter into finals

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఫైనల్లో జకోవిచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: