అందరి దృష్టి నిజామాబాద్ ఎన్నికల పైనే….

  జగిత్యాల: అందరి దృష్టి నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపైనే నిలిచింది. 185 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని, బ్యాలెట్ ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తామని పేర్కొన్న ఎన్నికల సంఘం చివరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ జరిపేందుకు సన్నద్దమైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఇంత వరకు వినియోగించిన ఎం2 ఈవిఎంల స్థానంలో ఎం3 ఈవిఎంలను తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎం3 ఈవిఎంలను మొట్ట […] The post అందరి దృష్టి నిజామాబాద్ ఎన్నికల పైనే…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జగిత్యాల: అందరి దృష్టి నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపైనే నిలిచింది. 185 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని, బ్యాలెట్ ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తామని పేర్కొన్న ఎన్నికల సంఘం చివరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ జరిపేందుకు సన్నద్దమైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఇంత వరకు వినియోగించిన ఎం2 ఈవిఎంల స్థానంలో ఎం3 ఈవిఎంలను తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎం3 ఈవిఎంలను మొట్ట మొదటగా నిజామాబాద్ ఎన్నికల్లో వినియోగించేందుకు సర్వం సిద్దం చేశారు. ఈ మేరకు జగిత్యాలకు 200 మంది ఇంజనీర్లు వచ్చి కొత్తగా వచ్చిన ఎం3 ఈవిఎంల పని తీరును పరిశీలిస్తున్నారు.

గతంలో పోలింగ్ కేంద్రంలో ఒకటి తప్పితే రెండు ఈవిఎంలను వినియోగించగా ఇప్పుడు ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవిఎంలు వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తికమక పడకుండా వారికి అవగాహన కల్పించేందుకు అధికారులు జగిత్యాలలో మార్చి 11వ తేదీన మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరిస్తున్నారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ నిఖిల్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు జగిత్యాలకు చేరుకుని మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. నిజామాబాద్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా తెప్పించిన ఎం3 ఈవిఎంల పనితీరులో ఏమైనా సమస్యలు ఏర్పడితే వెంటనే ఎలా పరిష్కరిస్తారనే విషయాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.

ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవిఎంలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఏమైనా సమస్యలు ఏర్పడితే అప్పటికప్పుడు పరిష్కరించడం.. వాటి స్థానంలో కొత్త ఈవిఎంలను ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈవిఎంల సంఖ్య పెరిగినందున పోలింగ్ కేంద్రంలో అధికారులు, సిబ్బంది, పోలింగ్ ఏజంట్లు కూర్చునే అవకాశం లేనందున పోలింగ్ కేంద్రం బయట ప్రత్యేకంగా షామియానాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఈవిఎంలను మొదట యు (U) ఆకారంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఇప్పుడు ఎల్ (L) ఆకారంలో ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓటర్లు మొదటి ఈవిఎం వైపు నుంచి వెళ్తేనే జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల గుర్తులు ముందుగా కనిపించనున్నాయి.

మొదటి ఈవిఎం నుంచి కాకుండా చివరి ఈవిఎం నుంచి వెళ్లినట్లయితే జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల గుర్తుల కోసం వెదుక్కొవాల్సిన పరిస్థితి ఉంటుందని, తద్వారా పోలింగ్ ప్రక్రియలో జాప్యం జరుగుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఒక్కో ఓటరు ఓటు వేసేందుకు కనీసం రెండు మూడు నిమిషాలకు మించి సమయం పట్టడం వల్ల ఓటర్లు క్యూలో బారులు తీరాల్సి వస్తుందని, క్యూ పెద్దగా ఉంటే మండుతున్న ఎండల నేపథ్యంలో క్యూలో నిల్చునే ఓపిక లేని వారు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తారో లేదోననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాగా తమకు ఎన్నికల గుర్తుల నమునాలు ఇవ్వనందున తాము తమ గుర్తులను ప్రచారం చేసుకోలేకపోయామని, ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఎన్నికల బరిలో నిలిచిన రైతులు కోర్టును ఆశ్రయించారు.

తమ నిరసనను దేశవ్యాప్తంగా తెలియజేయాలని 177 మంది పసుపు, ఎర్రజొన్న, చెరుకు రైతులు నామినేషన్లు వేయడంతో అందరి దృష్టి నిజామాబాద్ ఎన్నికపై పడింది. ప్రపంచంలోనే మొదటి సారిగా ఎం3 ఈవిఎంలను నిజామాబాద్ ఎన్నికల్లో వినియోగించడం చరిత్రలో నిలిచిపోనుందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అధిక సంఖ్యలో ఈవిఎంలు ఏర్పాటు చేసి నిర్వహించే పోలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రోజుకు ఒకరిద్దరు ఉన్నతాధికారులు ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఈవిఎల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు సైతం కొంత ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ కేంద్రంలో ఓటర్లు మొదటి ఈవిఎం వైపు నుంచి వెళ్లేలా సిబ్బంది సూచిస్తారని, నిర్దేశిత సమయంలోనే ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో మరిన్ని మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు వారికి శిక్షణనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు.

M3 EVM machine in Nizamabad Election

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందరి దృష్టి నిజామాబాద్ ఎన్నికల పైనే…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: